తమిళ దర్శకులు కాస్త వయెలెన్స్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. పైగా ఆయా సన్నివేశాల్ని చాలా `రా`గా తీసి పడేస్తారు. తమిళ ప్రేక్షకులకు అలానే నచ్చుతాయి మరి. వయెలెన్స్ అనగానే హరి, లింగుస్వామి లాంటి డైరెక్టర్లు గుర్తొస్తారు. ఇప్పుడు లింగుస్వామి తెలుగులో నేరుగా ఓ సినిమా చేశాడు. అదే `వారియర్`. ఇందులోనూ కావల్సినంత హీరోయిజం, ఫన్ తో పాటుగా.,. యాక్షన్, హింస, రక్తపాతం ఉన్నాయట. లింగుస్వామి ఆయా సన్నివేశాల్ని తమిళ స్టైల్ లో తీసుకొంటూ పోయాడని, అవి తెలుగు ప్రేక్షకులకు ఏ మేరకు ఆకట్టుకుంటాయో కాస్త సందిగ్థంలో ఉందన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్.
ముఖ్యంగా సెకండాఫ్‌లో రక్తపాతం ఏరులై పారిందట. అందుకే ఎడిటింగ్ టేబుల్ దగ్గర ఆయా సీన్స్‌ని ట్రిమ్ చేసే పనిలో పడ్డారని తెలుస్తోంది. ఈ సినిమాతో ఆది పినిశెట్టి విలన్ గా నటించాడు. తనలోని క్రూరత్వం చూపించడానికి కొన్ని సీన్లు రాసుకొన్నాడట దర్శకుడు. అవి మరీ ఓవర్ ది బోర్డ్ అనిపించేలా ఉన్నాయన్న ఫీలింగ్ దర్శక నిర్మాతలకు ఇప్పుడొచ్చిందట. అందుకే ఆ సీన్లు తమిళంలో అలానే ఉంచేసి, తెలుగులో మాత్రం కత్తెరించారని సమాచారం. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో రామ్ తన తమిళ మార్కెట్ ని పెంచుకోవాలని చూస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఓకే అనిపించుకొంది. బుల్లెట్ సాంగ్ మాస్‌కి బాగా నచ్చింది. విజిల్ సాంగ్ కూడా కేక పుట్టించింది. మిగిలిన పాటలెలా ఉంటాయో చూడాలి.