జగన్, షర్మిల మధ్య కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రాజీ కుదిర్చారన్న ప్రచారం రాజకీయవర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది. షర్మిలకు ఆస్తిలో సమాన వాటా ఇచ్చేందుకు జగన్ అంగీకరించారని అంటున్నారు. కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేసి ఏపీలో రాజకీయాలు చేయడానికి సైతం షర్మిల సిద్ధం కావడంతో జగన్మోహన్ రెడ్డి డీకే శివకుమార్ ద్వారా రాజీ చర్చలు జరిపించారని అంటున్నారు. వైఎస్ కుటుంబానికి సాన్నిహిత్యం ఉన్న డీకే శివకుమార్ అన్నా చెల్లెళ్లే పంచాయతీని తీర్చేందుకు ప్రయత్నించారు
వచ్చే ఎన్నికలకు షర్మిల ఏపీ వైపు రాకపోతే చాలని.. జగన్ రెడ్డి అనుకుంటున్నారు. అందుకే ఇలాంటి ప్రతిపాదనలు పెట్టి ఆస్తి ఇస్తానని కబురు చేస్తున్నారని అంటున్నారు. అయితే షర్మిల ఏపీలో కాంగ్రెస్ బాధ్యతలు తీసుకోవడానికి రెడీ అవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఆమె వైపు నుంచి ఎలాంటి ధృవీకరణలు రాలేదు కానీ… కొంత మంది మాత్రం ఇదే జరగొచ్చని అభిప్రాయపడుతున్నారు. వైసీపీ ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ పార్టీదేనని.. ప్పుడు షర్మిల వెనక్కి వస్తే కొంత మంది కాంగ్రెస్ కు ఓటు వేసే అవకాశం ఉందని నమ్ముతున్నారు. ఇది వైసీపీకి చేటు చేస్తుది కాబట్టే.. ఆమెను ఏపీ వైపు రాకుండా డీకే శివకుమార్ ద్వారా రాజీ చేసుకుంటున్నారు.
కాంగ్రెస్ నేతలతో జగన్ రెడ్డి టచ్ లోకి వెళ్లాడని బీజేపీకి తెలియడంతో ఢిల్లీలో విజయసాయిరెడ్డి డబుల్ గేమ్ ప్రారంభించారు. పార్లమెంట్ కశ్మీర్ పై జరిగిన చర్చలో బీజేపీని చల్లబరిచేలానెహ్రును నిందించారు. తర్వాత ప్రధానిని కలిశారనని ట్వీట్ చేశారు. కానీ ఫోటో బ యటకు రాలేదు. మొత్తంగా… కాంగ్రెస్, బీజేపీలను సమానంగా వాడేసుకోవాలనుకునే జగన్ రెడ్డి ప్రయత్నం రివర్స్ అయినా ఆశ్చర్యం లేదన్న వాదన వైసీపీలోనే వినిపిస్తోంది.