బంగ్లాదేశ్‌లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని తరిమేసి..తాను గద్దెనెక్కిన మహమ్మద్ యూనస్ తీరుపై ఆ దేశంలో అసంతృప్తి పెరిగిపోతోంది. ప్రజా తిరుగుబాటు ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికి ఆయన తన దేశాన్ని చైనాకు తాకట్టు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. భారత వ్యతిరేకులతో చేతులు కలిపారు. పాకిస్తాన్ , చైనాలతో పాటు ఇతర భారత వ్యతిరేక దేశాలతో.. స్నేహం చేస్తూ తన పదవిని కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
బంగ్లాదేశ్ ఒకప్పుడు ప్రోగ్రెసివ్ కంట్రీ. అక్కడి గార్మెంట్స్ ఇండస్ట్రీ శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉండేది. ఇప్పటికీ ప్రపంచప్రఖ్యాత బ్రాండ్లు చాలా వరకూ అక్కడి యూనిట్లలోనే తయారు అవుతాయి. ఈ అభివృద్ధిని అందుకుని మరింతగా ముందుకెళ్లాల్సిన దేశాన్ని వడ్డీ వ్యాపారి అయిన మహమ్మద్ యూనస్ మరో పాకిస్తాన్ చేసేందుకు సిద్ధమయ్యారు. అసలు దేశాన్ని నడిపించే అర్హాత ఆయనకు ఎలా వచ్చిందో ఆయన చెప్పలేకపోతున్నారు. ప్రజలు ఎన్నుకోని ఆయన.. బంగ్లాదేశ్ ను చైనాకు తాకట్టు పెట్టడానికి సద్ధమవుతున్నారు.
ఇప్పటికే ఆయన తీరుపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. సైన్యంలోనూ అసంతృప్తి వస్తోంది. షేక్ హసీనా అడ్డం లేకపోతే ఇక తిరుగుఉండదని అనుకుని ఆమెను అప్పగించాలని ఇండియాపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే హసీనా ఇప్పటికీ బంగ్లాదేశ్ లో రాజకీయాలు చేస్తున్నారు. ఆజ్ఞాతంలో ఉన్నప్పటికీ ఆన్ లైన్ ద్వారా ఆమె అక్కడి ప్రజలకు చేరువ అవుతున్నారు. ఈ వ్యవహారంతో మరో ప్రజాతిరుగుబాటు వచ్చి యూనస్‌కు సెగ రేపడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే విద్యార్థుల ఉద్యమం చల్లబడిపోయింది. వారు యూనస్ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టుకున్నారు.