రాయలసీమలో అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న తిరుపతిలో రియల్ఎస్టేట్ అభివృద్ధి కూడా అదే స్థాయిలో ఉంది. వెంకన్న పాదాల చెంద అత్యంత పవిత్రంగా ఉండే నగరంలో నివసించేందుకు ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున వలసలు వస్తున్నాయి. దీనికి ఉపాధి అవకాశాలు భారీగా పెరగడమే. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల సౌకర్యాలు తీర్చే వ్యాపారాలే తిరుపతికి పెద్ద ఆదాయవనరు అన్నట్లుగా ఉండేది . కానీ గత పదేళ్లుగా పరిస్థితి మారుతోంది.
రాష్ట్ర విభజన తర్వాత ఎలక్ట్రానిక్ క్లస్టర్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున పరిశ్రమల్ని ఆకర్షించడంతో పరిస్థితి మారిపోయింది. ఇతర పరిశ్రమలు కూడా రావడంతో ఉపాధి పెరుగుతోంది. దీంతో తిరుపతిలో స్థిరపడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గతంలో రిలయన్స్ సెజ్ ఏర్పాటు చేయాల్సింది కానీ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం క్యాన్సిల్ చేయడంతో అతి పెద్ద పారిశ్రామిక పార్క్ మిస్ అయింది.
ప్రస్తుతం తిరుపతిలో స్థలాల రేట్లు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఇప్పటికీ పెట్టుబడి పెడితే అతి ఏ మాత్రం తక్కువ కాదని.. రిటర్న్స్ చాలాఎక్కువగా వస్తాయని అంచనా వేస్తున్నారు. అపార్టుమెంట్లలో అద్దెలు కూడా భారీగానే ఉన్నాయి. ప్రస్తుతం తిరుపతి శివార్లలో వేస్తున్న వెంచర్లలో ఇల్లు కట్టుకోవడానికి అనువుగా ఉంటే గజం యాభై వేలకుపైగా పలుకుతున్నట్లుగా బ్రోకర్లు చెబుతున్నారు. మంచి ఏరియాలో అయితే ఇక చెప్పాల్సిన పని లేదు. ముందుచూపుగా … తిరుపతి లో ఇల్లు కొనుగోలు చేసుకుంటే అదో స్టేటస్ గామారే అవకాశాలు కనిపిస్తున్నాయి.