కృష్ణవంశీ, రమ్యకృష్ణల వైవాహిక జీవితం గురించి టాలీవుడ్లో రకరకాల రూమర్లు. ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారని, వాళ్ల మధ్య అనుబంధం సన్నగిల్లిందని ఏవేవో పుకార్లు వినిపిస్తుంటాయి. వాటిని అటు కృష్ణవంశీ, ఇటు రమ్యకృష్ణ ఇద్దరూ లైట్ తీసుకుంటూనే ఉంటారు. ఇప్పుడు ‘మాతాంగి’ అనే ఓ సినిమా ఫంక్షన్లో రమ్య. వంశీ ఇద్దరూ జంటగా వచ్చారు. అంతే కాదు… తమ వారసుడ్ని కూడా వెంటబెట్టకుని వచ్చాడు. కృష్ణంంశీ అబ్బాయి మీడియా ముందుకు రావడం ఇదే తొలిసారి. తన పేరు రుత్విక్. కుర్రాడు చలాకీగానే ఉన్నాడు. దర్శకుల తనయులు సినిమాల్లోకి అడుగుపెట్టడం సహజమే. కృష్ణవంశీ కూడా తన వారసుడ్ని సినిమాల్లోకి తీసుకొస్తాడేమో చూడాలి. రమ్యకృష్ణ ప్రధాన పాత్రధారిగా నటించిన చిత్రం ‘మాతాంగి’. త్వరలోనే విడుదల కాబోతోంది. ఈ ఫంక్షన్లో రమ్యకృష్ణని చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇది వరకటి గ్లామర్ ఆమెలో ఇంకా కనిపిస్తూనే ఉంది. బాహుబలిలో ‘శివగామి’ పాత్రతో రమ్యకృష్ణ తన రీ ఇన్నింగ్స్‌ని ఘనంగా ప్రారంభించింది. ఇప్పుడు ఆమెకు బోల్డంత డిమాండ్. దాన్ని చక్కగానే క్యాష్ చేసుకుంటోంది. నాగచైతన్య – మారుతిల సినిమాలో రమ్య అత్తగా నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈవారంలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది.