ఒంగోలు నుంచి చెన్నైకు హవాలా సొమ్ములు డైలీ సర్వీస్లా తరలిపోతూనే ఉన్నాయి. కొన్నాళ్ల క్రితం మంత్రి బాలినేని డ్రైవర్ రూ. ఐదు కోట్లను తరలిస్తూ తమిళనాడు బోర్డర్లో అక్కడి అధికారులకు దొరికిపోయిన వ్యవహారం కలకలం రేపింది. వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఎమ్మెల్యే స్టిక్కర్ వాడుకుని దర్జాగా తరలిస్తున్నారు. దొరికిపోయిన తర్వాత ఓ బంగారం వ్యాపారి… బాలినేని అనుచరుడు తెర మీదకు వచ్చి అది తన వ్యాపారం సొమ్మని కవర్ చేసుకున్నారు. ఆ కేసమయిందో ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు మరోసారి రూ. కోట్లలో హవాలా సొమ్ము చెన్నైలో పట్టుబడింది. అది కూడా ఒంగోలు నుంచే వెళ్తోంది.
అంత మొత్తంలో కోట్లకు కోట్లు ఏపీ నుంచి ఎలా వెళ్తున్నాయి.. అదీ నోట్ల రూపంలో అన్నది చాలా మందికి పజిల్గానే మారింది. పట్టుకుంటున్నది ఒక్క శాతం కూడా ఉందని… డైలీ సర్వీస్లా వెళ్తూనే ఉన్నాయన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. ఏపీలో మద్యం , ఇసుక లావాదేవీలు మొత్తం నగదు రూపంలోనే జరుగుతూంటాయి. అది తప్ప మిగిలిన అన్ని వ్యాపారాల్లో డిజిటల్ లావాదేవీలు జరుగుతూంటాయి. చివరికి టీ కొట్లతో పాటు బంగారు దుకాణాల్లోనూ డిజిటల్ లావాదేవీలే ఉంటాయి. ఎందుకంటే క్యాష్ రూపంలో రూ. రెండు లక్షల కన్నా ఎక్కువ లావాదేవీలు జరపడం చట్ట ప్రకారం నేరం.
మరి ఒంగోలు నుంచి ఇంత పెద్ద మొత్తంలో ఎలా తరలి వెళ్తున్నాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అది కూడా ఏపీలో ఎవరూ పట్టుకోవడం లేదు. బోర్డర్ దాటిన తర్వాత తమిళనాడులో మాత్రమే పట్టుబడుతున్నాయి. ఏపీలో ఎందుకు చెకింగ్లు చేయడం లేదన్నది చాలామందికి వచ్చే డౌట్. ఇవన్నీ మనకెందుకు అనుకునే వ్యవస్థ ఏపీలో ఇప్పుడు డెవలప్ అయింది కాబట్టి ఈ విషయాలేమీ బయటకు రావు.