స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కేసులో చంద్రబాబుకు హైకోర్టు పూర్తి స్థాయి బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే మెడికల్ గ్రౌండ్స్ పై ఆయన నాలుగు వారాల మధ్యంతర బెయిల్ పై ఉన్నారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో బెయిల్ మంజూరు కావడంతో మధ్యంతర బెయిల్ షరతులు కూడా ఉనికిలో లేనట్లే.
స్కిల్ ప్రాజెక్టులో స్కాం అంటూ నమోదు చేసిన కేసులో చంద్రబాబు ఏ 37గా ఉన్నారు. కేులో చివరి వ్యక్తి ఆయనే. ఈ కేసులో ఉన్న వారిలో అరెస్టు చేసిన వారు నెల రోజుల్లోనే బెయిల్ తెచ్చుకున్నారు. వారిపైనా ఎలాంటి సాక్ష్యాలను సీఐడీ చూపించలేకపోయింది. కానీ ఏ 37 అయిన చంద్రబాబును మాత్రం 52 రోజులు జైల్లో ఉంచారు ఇటీవల ఏ 35 నిందితుడికి.. సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ కూడా మంజూరు చేసింది.
కర్నూలులో రాజకీయ పర్యటనలో ఉన్న సమయమంలో రెండున్నర నెలల కిందట చంద్రబాబును అరెస్టు చేశారు. 52 రోజుల పాటు జైల్లో ఉంచారు. కానీ చంద్రబాబు తప్పు చేశారని కనీస ఆధారాలను కోర్టులో సమర్పించలేకపోయారు. పదే పదే వాయిదాలు కోరుతూ కేసు విచారణ ఆలస్యమయ్యేలా చేశారు. ఇప్పటికీ.. చంద్రబాబుపై కొత్త కొత్త కథలు కోర్టుకు చెబుతూనే ఉన్నారు కానీ దేనికీ ఆధారాలు చూపించలేదు.
స్కిల్ కేసు మాత్రమే కాదు.. సీఐడీ తనపై నమోదు చేస్తున్న కేసులన్నీ చట్ట విరుద్ధమని … సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై తీర్పు రావాల్సి ఉంది. ఈ వారంలో తీర్పు వచ్చే అవకాశం ఉంది.