యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ విద్యార్ధి రోహిత్ కి న్యాయం చేయాలని కోరుతూ గత నాలుగు రోజులుగా ఏడుగురు విద్యార్ధులు చేస్తున్న ఆమరణ దీక్షని శనివారం యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది భగ్నం చేసారు. యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉండటంతో పోలీసులు లోపలకి ప్రవేశించకుండా యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బందితోనే విద్యార్ధుల దీక్షని భగ్నం చేయించారు. ఏడుగురు విద్యార్ధులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నాలుగు రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో విద్యార్ధులు బాగా నీరసించి ఉన్నారు. రేపు లేదా ఎల్లుండి విద్యార్ధులందరినీ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేయవచ్చునని సమాచారం.