ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై సోమవారం విచారణ జరగనుంది. అటు సీబీఐ, ఇటు ఈడీ కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై రౌస్ అవెన్యూ కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
ఇదే కేసులో కవితకు విధించిన జ్యుడిషియల్ రిమాండ్ మంగళవారంతో ముగియనుంది. దాంతో మరోసారి జ్యుడిషియల్ రిమాండ్ ను కోర్టు పొడిగిస్తుందా…? కవితకు బెయిల్ మంజూరు చేస్తుందా..? అని బీఆర్ఎస్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
కవిత బెయిల్ పిటిషన్లపై ఈడీ, సీబీఐ తరఫు న్యాయవాదులు ఆమెకు బెయిల్ ఇవ్వొద్దని కోర్టును కోరారు. బయటకు వెళ్తే ఆమె దర్యాప్తు ప్రక్రియకు విఘాతం కల్గుతుందని… సాక్ష్యాలను తారుమారు చేస్తారని సీబీఐ ఆరోపించింది. సౌత్ గ్రూప్ కు చెందిన శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించారని ఆరోపించింది. ఈ కేసులో శరత్ అప్రూవర్ గా మారడంతో కోర్టు ఆయన నుంచి స్టేట్ మెంట్ రికార్డ్ చేసింది.
దీంతో కవితకు బెయిల్ కష్టమేనని న్యాయనిపుణుల విశ్లేషణల నేపథ్యంలో కోర్టు ఎలాంటి నిర్ణయం వెలువరిస్తుందోనని ఆసక్తి నెలకొంది.