ఏసీబీ కేసును క్వాష్ చేయడానికి నిరాకరిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో కేటీఆర్ వేసిన పిటిషన్పై అత్యవసర విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అంత అత్యవసరం లేదని తమ ఎదుట మెన్షన్ చేసిన కేటీఆర్ తరపు లాయర్ కు సీజేఐ ధర్మాసనం స్పష్టం చేసింది. పదిహేనో తేదీన ఈ పిటిషన్ పై విచారణ జరుపుతామని తెలిపింది.
అత్యవసర విచారణ జరిపితే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో కనీసం అరెస్టు నుంచి అయినా ఉపశమనం పొందాలని కేటీఆర్ లీగల్ టీం భావించింది. అయితే పదిహేనో తేదీకి వాయిదా పడటంతో ఈ లోపు ఏసీబీ లేదా ఈడీ అరెస్టు చేసినా ఇబ్బందికరమే. ఈ రెండు దర్యాప్తు సంస్థలు ప్రస్తుతానికి నోటీసులు జారీ చేస్తున్నాయి. ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. పదహారో తేదీన ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఏసీబీ అరెస్టు చేస్తే ఈడీ ఏం చేస్తుందన్నది ఆససక్తికరంగా మారింది. అయితే ఏసీబీ అరెస్టు చేయకపోవచ్చని చెబుతున్నారు.
సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ పై విచారణ జరిగిన తర్వాతనే ఏ నిర్ణయమైనా తీసుకకుునే అవకాశం ఉందని ఉంటున్నారు. సుప్రీంకోర్టు రిలీఫ్ ఇవ్వడానికి నిరాకరిస్తే అప్పుడు అరెస్టు చేయడానికి ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకపోవచ్చని భావిస్తున్నారు. ఈడీ ఎదుట హాజరు కావడానికి ముందు రోజే సుప్రీంకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉండటం ఒక్కటే కేటీఆర్కు కాస్త ఊరట.