భరత్ అనే నేను సినిమాలో… మహేష్ బాబు ముఖ్యమంత్రి అవ్వగానే… ట్రాఫిక్ సెన్స్ లేకుండా పోయిన జనాలకు.. వాతలు పెట్టడానికి… జరిమానాలను.. ఓ రేంజ్లో పెంచుతారు. సినిమా హిట్టయింది. ప్రజలకు అలా చేయడం నచ్చిందేమో అనుకున్నట్లు ఉన్నారు.. భారత పాలకులు కూడా.. అదే రూట్లో ఫాలో అయిపోయారు. ట్రాఫిక్ నిబంధనలల ఉల్లంఘనలకు… జరిమానాలు… వేలు, లక్షలకు కూడా చేర్చి… కొత్త చట్టం రూపొందించారు. ఇది రేపట్నుంచి అమల్లోకి రానుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టం అమలుకు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేయాల్సి ఉంది కాబట్టి… తెలుగు రాష్ట్రాల్లో కొంత సమయం తీసుకోనున్నాయి. ఎంత సమయం తీసుకున్నా… అతి త్వరలోనే ఇవి అమల్లోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.
హెల్మెట్ లేకపోయితే.. రూ. వెయ్యి జరిమానా, 3 నెలలు డ్రైవింగ్ లైసెన్సు రద్దు. కారు నడుపుతూ సీటు బెల్ట్ పెట్టుకోకపోయినా అంతే. మితిమీరిన వేగంతో నడిపినా, బీమా లేకున్నా, అధికలోడు తీసుకెళ్తున్నా.. ఇలా ఒక్కోదానికి పడే వడ్డన భారీగానే. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే రూ. పదివేలు. మైనర్లకు బండి ఇస్తే.. రూ. పాతికవేలు వదిలించుకోవడమే కాదు.. మూడేళ్ల జైలు శిక్ష.. పెద్దలకు పడుతుంది. ఈ శిక్షలు లక్షల్లోనే ఉన్నాయి. లైసెన్స్ లేకుండా క్యాబ్ నడిపితే.. జరిమానా అక్షరాలా రూ. లక్ష. ఈ జరిమానాలు ఒక్కో సారి.. నడుపుతున్న బండిని అమ్ముకున్నా… మరికొంత ఎక్కువ వేసి కట్టాల్సినంతగా ఉన్నాయి.
రూల్స్ మీరితే వాహనం అమ్ముకున్నా చెల్లించలేనంత చలాన్ పడుతుంది. ఈ చలాన్లు… సింగపూర్ రేంజ్లో ఉన్నాయి. సింగపూర్‌లో అయితే.. అక్కడ ప్రభుత్వం ఏ చిన్న ఉల్లంఘనకు అయినా భారీగా బాదేస్తుంది. ఆ భయంతోనే అక్కడ అందరూ… కట్టుదిట్టంగా ఉంటారు. కానీ.. అక్కడి ప్రభుత్వం.. అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుంది. వాహన సాంద్రతకు తగ్గట్లుగా మౌలిక వసతులు కల్పిస్తుంది. సిగ్నల్స్ పెట్టి… ఫోటోలు తీసుకుంటూ కాలం గడపతారు. రోడ్లుపై గుంతలు ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంది. చలాన్‌పై ఉన్న ఆసక్తి ట్రాఫిక్ క్రమబద్దీకరణపై కూడా పెుతుంది. కానీ భారత్‌లో మాత్రం.. చలాన్లు మాత్రమే వసూలు చేస్తారు. మిగతా వాటి సంగతి పట్టించుకోరు.