ఆంధ్రప్రదేశ్‌లో రోడ్డెక్కాలంటే.. ట్రాఫిక్ రూల్స్‌పై సమగ్రమైన అవగాహన ఉండాలి. లేకపోతే..బండి ఖరీదు కన్నా ఎక్కువ ఫైన్ కట్టాల్సి రావొచ్చు. అనూహ్యంగా… రవాణా శాఖ … జరిమానాలను పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. బైక్ నుంచి 7 సీటర్ వాహనాల వరకు ఒకే విధమైన జరిమానా ఉంటుంది. సెల్‌ఫోన్ డ్రైవింగ్, డేంజరస్ డ్రైవింగ్ చేస్తే రూ. 10 వేల ఫైన్ వేస్తారు. రేసింగ్ పాల్పడితే మొదటిసారి రూ.5 వేలు, రెండోసారి రూ.10 వేలు, రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకపోతే మొదటిసారి రూ.2 వేలు ఫైన్, రెండోసారి పట్టుబడితే రూ.5 వేలు వసూలు చేస్తారు.
వాహనాలకు పర్మిట్ లేకపోతే రూ.10 వేలు, ఓవర్‌లోడ్‌కు రూ.20 వేలు, వాహన బరువు చెకింగ్ కోసం ఆపకపోతే రూ.40 వేలు ఫైన్ వేస్తారు. అలాగే ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకుంటే రూ.10 వేలు వసూలు చేస్తారు. అంతటితో అవలేదు.. అనవసరంగా హారన్ మోగిస్తే మొదటిసారి రూ. వెయ్యి, రెండోసారి రూ.2 వేలు వడ్డిస్తారు. ఓవర్ స్పీడ్‌కు రూ. వెయ్యి ఖరారు చేశారు. ఈ జరిమానాలూ చూసి వాహనదారులకు కళ్లు బైర్లు కమ్మే పరిస్థితి ఏర్పడింది. ఎక్కువగా ఆటోవాలాల నుంచి రవాణా శాఖ ఫైన్లను వసూలు చేస్తూంటుంది.
అన్ని రకాల నిబంధనలతో ఆటోలు నడపడం అనేది అసాధ్యమని ఆటో రంగంలో ఉన్న వారు చెబుతూంటారు. రవాణా శాఖ అధికారులు వసూలు చేయాలంటే.. ఏదో ఓ వంక పెట్టి ఫైన్ వేయగలరు. ఇదే ఇప్పుడు.. ఏపీలో వాహనదారుల్ని భయపెడుతోంది. వివిధ పథకాల కింద.. ప్రజలక ుఇస్తున్న డబ్బులను పెట్రోల్ రేట్లను పెంచడం ద్వారా… ఫైన్లు వేయడం ద్వారా వసూలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.