‘కుమారి 21ఎఫ్’ సినిమాతో యూత్ లో సెన్సేషన్ గా మారింది హెబ్బా పటేల్. బోల్డ్ క్యారెక్టర్ లో కనిపించి కుర్రకారుని క్లీన్ బౌల్డ్ చేసింది. ఈ సినిమాతో హెబ్బా కెరీర్ నెక్స్ట్ లెవల్ కి వెళ్ళిపోతుందనే అంచనాలు ఏర్పడ్డాయి. కానీ హెబ్బా ప్రయాణం అంత సక్సెస్ ఫుల్ గా జరగలేదు.
హెబ్బా ఇండస్ట్రీలో వచ్చిన పదేళ్ళు అయిపొయింది. మరి ఈ పదేళ్ళలో ఆమె కెరీర్ అనుకున్నంత రీచ్ కి చేరుకుందా? ఇదే ప్రశ్న హెబ్బాని అడిగితే ఆసక్తికరమైన సమాధానం చెప్పింది. ”సినిమా జర్నీపట్ల ఆనందంగానే వుంది. ఈ జర్నీని ఆస్వాదించాను. అయితే కొన్ని తప్పులు చేశాను. వాటి నుంచి నేర్చుకున్నాను. అలాంటి తప్పులు మళ్ళీ పునరావృతం కాకుండా జాగ్రత్తపడతాను’ అని చెప్పింది హెబ్బా.
‘అలా ఎలా’ సినిమాతో కెరీర్ మొదలుపెట్టింది హెబ్బా. అది మంచి సినిమానే. తర్వాత కుమారితో సెన్సేషన్ గా మారింది. సుకుమార్ బ్రాండ్ తో వచ్చిన ఆ సినిమా టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. అయితే ఆ తర్వాత కొన్ని మంచి ప్రాజెక్ట్స్ చేసినప్పటికీ ఆడో రకం ఈడో రకం, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, మిస్టర్, అందగాడు, ఏంజెల్ 24 కిసెస్స్.. ఈ సినిమాలన్నీ ఆమెకు ఎంత మాత్రం హెల్ప్ కాకపోగా కెరీర్ ని వెనక్కి లాగేశాయి. బహుసా కెరీర్ పరంగా ఆమె చేసిన రాంగ్ సెలెక్షన్స్ ఇవే కావచ్చు.
అన్నట్టు.. ఓదెల 2లో ఒక కీలక పాత్ర చేస్తోంది హెబ్బా. గతంలో ఓదెలలో ఆమెదే లీడ్ రోల్. ఆ సినిమాకి మంచి పేరు వచ్చింది. ఇప్పుడు తమన్నాతో కలసి నటించింది. ఏప్రిల్ 17న ఈ సినిమా వస్తోంది. ఈ సినిమాలో తన పాత్ర ఖచ్చితంగా ప్రభావాన్ని చూపిస్తుందని నమ్మకంగా చెబుతోంది.