కుమారి 21 ఇవాళ్టితో 32అయ్యింది. సిల్వర్ స్క్రీన్ పై గ్లామర్ ట్రీట్ ఇస్తూ యువత కళ్ళలో నిద్ర లేని రాత్రుల్ని మిగిల్చిన కుమారి 21ఎఫ్ ఎలియాస్ హెబ్బా పటేల్ పుట్టిన రోజు ఇవాళ. 1989 జనవరి 6 న ముంబై లో జన్మించిన హెబ్బా మోడల్ గా, హీరోయిన్ గా తళుక్కున మెరిసింది. 2014 లో కన్నడ చిత్రం అధ్యక్ష తో తెరంగేట్రం చేసిన ఆమె అలా ఎలా సినిమాతో తెలుగులో నటించింది. 2015 లో డైరెక్టర్ సుకుమార్ రూపొందించిన కుమారి 21 ఎఫ్ లో బోల్డ్ గా యాక్ట్ చేసింది. అమ్మాయిలు అంత నిర్మొహమాటంగా మాట్లాడతారన్న విషయాన్ని ఈ చిత్ర నాయిక చెప్పడం ఆ చిత్రం సంచలన విజయానికి కారణమైనది.
నాయికగా నటించిన సినిమాలు తక్కువే అయినా ఇండస్ట్రీలో తన ముద్ర ప్రగాఢంగా వేసిందని చెప్పాలి.
2014 లో కన్నడ లో అధ్యక్ష, తమిళంలో తిరుమణం ఎనుం నిక్క, తెలుగులో అలా ఎలా కనిపించి కనువిందు చేసిన హెబ్బా 2015 లో తెలుగులో కుమారి 21 ఎఫ్, ఈడో రకం ఆడో రకం, 2016 లో ఎక్కడికి పోతావ్ చిన్నవాడా అనే హర్రర్ మూవీలో, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, మిస్టర్ చిత్రాల్లో నటించింది. 2017lo అందగాడు, ఏంజెల్, 2018 లో 24 కిస్సెస్, భీష్మ, 2020 లో ఒరేయ్ బుజ్జిగా చిత్రాల్లో నటించింది.
లేటెస్ట్ గా హీరో రామ్ పోతినేని నటిస్తున్న రెడ్ చిత్రంలో దించక్ అన్న స్పెషల్ సాంగ్ లో నర్తిస్తోంది.
హెబ్బా పనైపోయిందంటూ విమర్శకులు అంటున్నా స్పెషల్ సాంగ్స్ లో మెరిసి మురిపిస్తూ తన హొయల్ని సిల్వర్ స్క్రీన్ కి అద్దుతోంది.