కుమారి 21 ఎఫ్‌తో అందరి దృష్టిలో పడిపోయింది హెబ్బా పటేల్. బోల్డ్ క్యారెక్టర్స్‌కి భలే న్యాయం చేస్తుందన్న నమ్మకం కలిగింది. దాంతో.. హెబ్బా చుట్టూ నిర్మాతలు మూగిపోయారు. ఆమె చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలున్నాయి. ఇప్పుడు ఓ లేడీ ఓరియెంటెడ్ స్ర్కిప్టునీ ఓకే చేసింది. భాస్కర్ బండి అనే కొత్త దర్శకుడు హెబ్బాకి ఓ కథ చెప్పి ఓకే చేయించుకొన్నాడు. అదే.. నేనూ – నా బోయ్ ఫ్రెండ్స్. బెక్కం వేణుగోపాల్ నిర్మాత. ఏప్రిల్ లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది.
కుమారి 21 ఎఫ్‌లో ఉన్న బోల్డ్ సీన్స్‌ని, వాటిలో హెబ్బా నటించిన విధానం చూసి అందరూ షాకయ్యారు. అయితే ఈ సినిమాలో అంతకు మించిన బోల్డ్ సీన్స్ కనిపించబోతున్నాయట. స్వేచ్ఛ పేరుతో నేటి అమ్మాయిలు ఎంత వరకూ వెళ్తున్నారో, వాటి వల్ల ఏర్పడే ముప్పులేమిటో ఈ సినిమా ద్వారా చూపించబోతున్నార్ట. కథ ఏదైతేనేం.. బోల్డ్ నెస్ పేరుతో బోల్డంత బూతు చూపించే అవకాశం అయితే చిక్కింది. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.