సాధారణంగా హీరోలకు డూప్‌ల అవసరం ఏర్పడుతుంటుంది. ఫైటింగుల్లో, రిస్కీ షాట్లలో డూప్‌లు కావాలి. మరి హీరోయిన్లకూ డూప్‌లు అవసరం అవుతారా?.. అవుతారు. డ్యూయల్ రోల్ చేసినప్పుడో, లేదంటే కొన్ని కొన్ని అనూహ్యమైన షాట్లు తీస్తున్నప్పుడో కావాలి. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమా చేస్తున్నప్పుడు శ్రీదేవికి కూడా ఓ సందర్భంలో డూప్ కావాల్సివచ్చింది. అలా శ్రీదేవికి డూప్ గా నటించింది ఎవరో తెలుసా?? …. మన హేమ. అవును.. ఆ సినిమాలో శ్రీదేవికి డూప్‌గా నటించింది హేమనే. అయితే ఒకే ఒక్క సన్నివేశంలో. శ్రీదేవి ఈత కొలనులో ఉంటే… అమ్రిష్ పురి వచ్చే సీన్ గుర్తుంది కదా? శ్రీదేవికి ఈత రాదు. ఆసమయంలో ఈత వచ్చిన అమ్మాయి అవసరం ఏర్పడింది. సరిగ్గా అదే రోజున ఊటీలో మరో సినిమా షూటింగ్ కోసం హేమ వెళ్లింది. ఆ టీమ్‌లోంచి హేమని తీసుకొచ్చి.. శ్రీదేవికి డూప్‌గా మార్చారు. ఈత కొలనులో ఉన్న సీన్లు చూడండి.. లాంగ్ షాట్లో ఉన్నది హేమనే. శ్రీదేవికి డూప్‌గా చేశానని ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటా అంటోంది హేమ. అన్నట్టు శ్రీదేవి- హేమ కలసి ‘క్షణం క్షణం’లో నటించారు. అందులో శ్రీదేవి మిత్రురాలి పాత్రని హేమ పోషించింది.