బెంగళూర్ రేవ్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. టాలీవుడ్ నటి హేమ రక్త నమూనాల్లో డ్రగ్స్ ఆనవాళ్ళను గుర్తించినట్లుగా తెలుస్తోంది. రేవ్ పార్టీలో పాల్గొన్న 150మంది నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించింది నార్కోటిక్ బృందం. అందులో 80మందికి పైగా రక్తనమూనాలో డ్రగ్స్ ఆనవాళ్ళు ఉన్నట్లు అధికారులు తేల్చారు.
ఇటీవల బెంగళూరు రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నట్లు వార్తలు రావడంతో తాను రేవ్ పార్టీలో పాల్గొనలేదని హైదరాబాద్ లోని ఫామ్ హౌజ్ లో ఉన్నానని ఆమె మొదట ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఆ తర్వాత పోలీసులు ఆమె రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు ఆధారాలు బయటపెట్టేసరికి ఇంట్లో ఉన్న మరో వీడియోను విడుదల చేసింది. ఈ క్రమంలోనే ఆమె రక్త నామూనాలో డ్రగ్స్ ఆనవాళ్ళు ఉన్నట్లు తేలడంతో తాజాగా ఆమె స్పందించారు. తాను డ్రగ్స్ తీసుకోలేదని.. త్వరలోనే అన్ని విషయాలను బయటపెడతానంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఆమె చెప్పబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.
అయితే, నార్కోటిక్ రిపోర్ట్ లో హేమతో పాటు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలిన వారిని బాధితులుగా పరిగణించి కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉంది.