సినిమా ఇండస్ట్రీలో పార్టీలు ఇచ్చి పుచ్చుకోవడం సర్వ సాధారణం. వీకెండ్ వచ్చిందంటే ఎక్కడో ఓ చోట ఏదో ఓ పార్టీ జరుగుతూనే ఉంటుంది. కొన్ని పార్టీలు మాత్రం ఇన్ సైడ్ వర్గాల్లో టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంటాయి. అలాంటి ఓ పార్టీ ‘గొడవ’ ఇది. ఓ అగ్ర హీరో కుమార్తె ఇండస్ట్రీలోని తనకు తెలిసిన సర్కిల్ కి ఓ పార్టీ ఇచ్చింది. అందులో దర్శకులు, హీరోలు, కొంతమంది ప్రధానమైన టెక్నీషయన్లు పాల్గొన్నారు. పార్టీ ఓ లెవల్ వరకూ బాగానే జరిగింది. వచ్చిన వాళ్లలో చాలామంది వెళ్లిపోయారు కూడా. కానీ తెల్లార్లూ ఎంజాయ్ చేసే బ్యాచ్ ఒకటి ఉంటుంది కదా. అలాంటి బ్యాచ్‌లో కొంతమంది మిగిలారు. వాళ్లలో ఓ దర్శకుడు, హీరో కూడా ఉన్నారు. వారిద్దరికీ పూర్వ పరిచయం ఉంది. ఇద్దరూ కలిసి ఓ సినిమా కూడా చేశారు. మాటల మధ్యలో ‘నేనే నీకు బ్రేక్ ఇచ్చా’ అన్నాడు దర్శకుడు. ఆ హీరోకి మండింది. ‘అప్పటికి నువ్వు అట్టర్ ఫ్లాప్ తీసిన బాధలో ఉన్నావ్. అందుకే నీకు ఛాన్స్ ఇచ్చా’ అన్నాడు హీరో. అలా.. ఇద్దరి మధ్య చిన్నగా మొదలైన గొడవ.. పెద్దదైపోయింది. ఒకరి జాకతాల చిట్టా మరొకరు విప్పుకొంటూపోయారు. దాంతో ఇదెక్కడిగొడవరా బాబూ.. అంటూ పార్టీకి వచ్చినవాళ్లంతా తలలు పట్టుకొన్నారు. ఎంతమంది సర్ది చెప్పాలనుకొన్నా వాళ్లిద్దరూ వినలేదు. మధ్యవర్తులుగా నిలవలేక చాలామంది వదిలేసి వెళ్లిపోయారు. చివరికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఆ హీరో కూతురు కూడా ‘తాగితే వీళ్లిద్దరూ ఇలా ప్రవర్తిస్తారా’ అంటూ విస్తుపోయిందట. మొత్తానికి ఈ వ్యవహారం తెల్లారే సరికి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయింది. ఇక మీద పార్టీలు ఇద్దాం అనుకొనే వాళ్లు ‘వీళ్లిద్దర్ని మాత్రం పిలవకూడదు’ అని గట్టిగా ఫిక్సవుతున్నట్టు టాక్. ఆ ఇద్దరూ ఎవరనేదా సందేహం. ఓ చిన్న క్లూ. పార్టీ ఇచ్చిన హీరో కుమార్తె.. గొడవ పడ్డ హీరోకు చాలా దగ్గరి చుట్టం. ఆ దర్శకుడేమో… ఆ ఫ్యామిలీ హీరోతో ఆల్రెడీ ఓ సినిమా చేస్తున్నాడు.