భగవంతుడికీ, భక్తుడికీ అనుసంధానం అంబికా దర్బార్ బత్తిలా, హీరోకీ, నిర్మాతకీ మధ్య మేనేజర్ అనే వంతెన ఉంటుంది. మేనేజర్ ఎంత సమర్థుడైతే, ఆ హీరో కెరీర్ అంత సవ్యంగా ఉంటుంది. అందుకే మేనేజర్ వ్యవస్థకు అంత ప్రాధాన్యం ఉంటుంది. చిత్రసీమలోని ఓ ప్రముఖ కుటుంబం నుంచి వచ్చిన హీరోకి కూడా తన మేనేజర్ పై అంతే గురి ఉంది. ఈరోజు మాత్రం ఆ హీరో, మేనేజర్ సెట్లో గొడవ పడి, ‘నువ్వెంత` అంటే ‘నువ్వెంత’ అనుకొని తిట్టుకొని విడిపోయారని టాక్.
ఇలా హీరో, మేనేజర్ల మధ్య మనస్పర్థలు రావడం కామనే. తిట్టుకోవడం, మళ్లీ కలిసిపోవడం కూడా మామూలే. కానీ.. ఈ హీరో, మేనేజర్ తిట్టుకొని గొడవ పడడమే ఆశ్చర్యం. ఎందుకంటే.. వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్. తన ఫ్రెండ్ ఓ మంచి కంపెనీలో ఉద్యోగం చేసుకొంటుంటే, తనతో పాటే ఉండాలన్న ఆలోచనతో, ఆ ఉద్యోగం మాన్పించి మరీ మేనేజర్‌గా పెట్టుకొన్నాడు. ఆ మేనేజర్ కూడా కేవలం ఈ హీరోనే నమ్ముకొని ప్రయాణం చేస్తున్నాడు. సెట్లో సైతం అన్నదమ్ముల్లా ఉండే వీరిద్దరూ ఇలా తిట్టుకోవడం… సెట్లో వాళ్లందరినీ షాక్‌కి గురి చేసిందట. స్నేహితుల మధ్య ఇలాంటి చిన్న చిన్న క్లాషెష్ మామూలే అని.. ఇద్దరూ తిరిగి కలుసుకొంటారని, వీళ్లిద్దరి గురించి తెలిసినవాళ్లంతా చెప్పుకొంటున్నారు. మిగిలిన వాళ్లు మాత్రం ఈ గొడవకు రకరకాల కారణాలు వెతుక్కొనే పనిలో ఉన్నారు. ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ గొడవే హాట్ టాపిక్.