ఈమధ్య టాలీవుడ్ లో ప్రేమ జంటలు కాస్త ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా యంగ్ హీరోలు లివింగ్ టుగెదర్ రిలేషన్ షిప్ లో మునిగి తేలుతున్నారు. ఇటీవల ఇండస్ట్రీలోకి దూసుకొచ్చిన ఓ యువ హీరో సంగతి ఇది. తెలంగాణ నుంచి వచ్చిన ఈ కుర్ర హీరో మంచి ఫామ్ లో ఉన్నాడు. వరుసగా సినిమాలు చేస్తున్నాడు. కెరీర్‌పై ఎంత దృష్టి పెట్టాడో, తన ప్రైవేటు లైఫ్‌కీ అంతే ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నాడు.
ఇప్పుడు ఓ హీరోయిన్ తో సహజీవనం చేస్తున్నాడు. ఈ విషయం ఫిల్మ్ నగర్ మొత్తానికి తెలుసు. ఇప్పుడు ఆ హీరో, తన హీరోయిన్‌కి రూ.50 లక్షల ఖరీదైనకారు గిఫ్ట్ గా ఇచ్చాడట. ఆ కారులోనే హీరోయిన్ సెట్ కి వెళ్తూ, వస్తోందట. ఒకట్రెండు సార్లు.. హీరోగారి షూటింగ్ లో ఈ హీరోయిన్, ఆ హీరోయిన్ షూటింగ్ లో ఈ హీరో.. కనిపించారని, వాళ్ల అనుబంధం సెట్ సాక్షిగా అందరికీ అర్థమైపోయిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది ఒక జంట కథ. ఇలాంటి జంటలు టాలీవుడ్ లో చాలానే ఉన్నాయి. కొన్ని బయటకు తెలుస్తాయి. కొన్ని రసహ్యంగా జరిగిపోతాయి. అంతే తేడా.