హీరో నిఖిల్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. నిఖిల్ కు పితృ వియోగం కలిగింది. నిఖిల్ తండ్రి కావలి శ్యామ్ సిద్దార్థ్ కొద్దిసేపటి క్రితం కన్ను మూశారు. శ్యామ్ చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొద్దిరోజుల క్రితం వరకూ ఆయన హాస్పిటల్ లోనే వున్నారు. ఆరోగ్యం కొంచెం మెరుగవడంతో ఇటివలే ఇంటికి తీసుకొచ్చారు. ఆయన ఆరోగ్యం మళ్ళీ క్షీణించి చివరి శ్వాస విడిచారు. శ్యామ్ ఆర్మీలో పని చేశారు. రిటైర్మెంట్ తర్వాత ఇంటిదగ్గరే వున్నారు. నిఖిల్ ని ఎంతో ప్రోత్సాహాన్ని అందించారు. శ్యామ్ మృతి పట్ల బంధుమిత్రులు, స్నేహితులు సంతాపం ప్రకటించారు.