యువ హీరో సందీప్ కిషన్ అభిమాని ఒకరు శీను ఈ రోజు మరణించారు. అతడి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన సందీప్ కిషన్, శీను కుటుంబం బాధ్యత తాను తీసుకుంటున్నట్టు తెలిపారు. “నాకు మద్దతుగా నిలిచిన వ్యక్తులలో శీను ఒకరు. పరిస్థితులు ఎలా వున్నప్పటికీ నావైపు నిలబడ్డాడు. నా తొలి అభిమాని. నాకు ఎంతో నమ్మకమైన అభిమాని. నా సోదరుణ్ణి నేను కోల్పోయాను. చిన్న వయసులో ఈ లోకాన్ని వదిలి వెళ్ళాడు. శీనుకి ఎప్పటికీ రుణపడి వుంటాను. అతడి కుటుంబం బాధ్యత నాది. లవ్యూ శీను. ఎప్పటికీ నిన్ను మిస్ అవుతుంటా. నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా” అని సందీప్ కిషన్ ట్వీట్ చేశారు. హీరోలను అమితంగా అభిమానించడంలో తెలుగు ప్రజలు తరవాతే ఎవరైనా. అటువంటి అభిమానుల కోసం హీరోలు ముందుకు రావడం అభినందనీయం. అభిమాని మరణించిన బాధలో ఉన్న సందీప్ కిషన్.. అతడి కుటుంబం బాధ్యత తీసుకోవడానికి ముందుకు రావడాన్ని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు.