చంద్రబాబును అరెస్ట్ చేసిన తీరు చూసి మన దేశంలో చట్టాలు, న్యాయాలు ఉన్నాయా.. చంద్రబాబు పరిస్థితే అలా ఉంటే ఇక సామాన్యడి సంగతేమిటనే భయం ప్రతి ఒక్కరికి వచ్చింది. వైసీపీ వాళ్లకూ వస్తోంది. జగన్ రెడ్డి ఫ్యాన్‌ను అని బయటకే చెప్పుకునే తమిళ హీరో విశాల్ రెడ్డి కి కూడా అదే అనిపించింది. హైదరాబాద్‌లో తన కొత్త సినిమా ప్రమోషన్ కోసం వచ్చిన ఆయన చంద్రబాబు అరెస్టుపై స్పందించాలని మీడియా ప్రతినిధులు కోరడంతో మాట్లాడారు.
“అరెస్టుకు ముందు కొంచెం అలోచించి ఉంటే బాగుండేది. అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే మాలాంటి సామాన్యులకు ఒక భయం కలుగుతుంది. పక్కా ఆధారాలతో అరెస్ట్ చేసి ఉంటే బాగుండేది” అంటూ విశాల్ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. కాగా విశాల్ చిన్నతనం చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలోనే సాగింది. గతంలో విశాల్ కుప్పం రాజకీయంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని, వైసీపీ నుంచి బరిలోకి దిగి చంద్రబాబు పై పోటీ చేయనున్నాడని ప్రచారం జరిగింది. కానీ ఆయన ఖండించారు. రాజకీయాల్లోకి రావట్లేదన్నారు.
పధ్నాలుగేళ్లు సీఎంగా చేసిన చంద్రబాబుపై జగన్ రెడ్డి చేసిన దాష్టీకంపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. చివరికి సొంత పార్టీ నేతల కూడా సమర్థించడం లేదని సర్వేలు వెల్లడిస్తున్నాయి. టాలీవుడ్ కు చెందిన వారు ఎవరూ మాట్లాడకపోయినా తమిళ హీరోలు మాత్రం చంద్రబాబు అరెస్టు తప్పని చెప్పడానికి వెనుకాడటం లేదు.