విశాల్ వీడియో ఒకటి… పొద్దున్నుంచీ తెర వైరల్ అయిపోయింది. న్యూయార్క్ వీధుల్లో ఓ అమ్మాయితో విశాల్ నడుచుకొని రావడం, దాన్ని ఓ అభిమాని గమనించి వీడియో తీస్తుంటే, మొహాన్ని దాచేసుకొంటూ విశాల్ పరుగెట్టడం ఇదంతా వీడియోలో కనిపించిన దృశ్యాలు. దాంతో విశాల్ విదేశాల్లో అమ్మాయితో చక్కర్లు కొడుతున్నాడంటూ వార్త వైరల్ అయిపోయింది. ఇప్పుడు దీనిపై విశాల్ స్పందించాడు. అదంతా ఫ్రాంక్ అని, కజిన్స్ అందరూ కలిసి ఆట పట్టించడానికి క్రిస్మస్ రోజున ఈ వీడియో ప్లాన్ చేశారని క్లారిటీ ఇచ్చాడు. ఇటీవల విశాల్ తన కజిన్స్‌తో న్యూయార్స్ వెళ్లాడు. క్రిస్మస్ వేడుకల్ని అక్కడే జరుపుకొన్నాడు. ఈ సందర్భంగా విశాల్ ని ఆట పట్టించడానికి వాళ్లంతా ఓ వీడియో ప్లాన్ చేసి, దాన్ని సోషల్ మీడియాలో పెట్టారు.
అప్పటి నుంచీ.. విశాల్ ని కొందరు టార్గెట్ చేస్తూ.. సోషల్ మీడియాకెక్తారు. పరిస్థితి చేజారిపోతుందని గ్రహించిన విశాల్ దాన్నో ఫ్రాంక్ వీడియోగా కొట్టి పడేశాడు. ఎవర్నీ కించపరిచే ఉద్దేశం తనకు లేదని, ఈ వీడియో వాళ్ల ఎవరైనా బాధ పడతే క్షమించాలని కోరాడు. విశాల్ ఈ వీడియో ఎందుకు చేశాడో, ఇప్పుడు తీరిగ్గా ఎందుకు క్షమాపణలు చెబుతున్నాడో అర్థం కావడం లేదు జనాలకు. పబ్లిసిటీ కోసం ఏమైనా చేసేస్తారా? అంటూ బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఇదంతా నిజంగా ఫ్రాంకేనా, లేదంటే ఎలాగూ మీడియాకు లీకైపోయింది కాబట్టి, ఫ్రాంక్ వీడియో అంటూ కవరింగు చేసుకొంటున్నారా? అనే అనుమానాలూ ఉన్నాయి.