‘చెప్పవే చిరుగాలి’ హీరోయిన్ అభిరామి గుర్తుందా ? తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా నటిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. తమిళ్, మలయాళం, కన్నడలో ఆమెకు చెప్పుకోదగ్గ సినిమాలు వున్నాయి. చానాళ్ళ తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన అబిరామి.. మహారాజ, సరిపోదా శనివారం సినిమాలతో రెండు మంచి విజయాలు అందుకుంది. మహారాజలో అమెది మంచి క్యారెక్టర్. శనివారంలో చైల్డ్ ఎపిసోడ్ లో కూడా ఆమె కీలకం.
ఇప్పుడు రాజ్ తరుణ్ ‘భలే ఉన్నాడే’ సినిమాలో మదర్ రోల్ చేస్తుంది. నిజానికి మహారాజ, సరిపోదా శనివారం కంటే ముందు ఒప్పుకున్న సినిమా ఇది. కానీ ఆ రెండు సినిమాలు ముందుగా రిలీజ్ అయ్యాయి. ప్రస్తుతం అభిరామి చేతిలో చాలా ఆసక్తికరమైన సినిమాలు వున్నాయి. కమల్ మణిరత్నం థగ్ లైఫ్ లో ఓ కీలక పాత్ర చేస్తుంది. ఇది కాకుండా తమిళ్ లో హీరోయిన్ గా రెండు సినిమాలు వున్నాయి. అలాగే విలన్ గా కూడా మరో సినిమా చేస్తుంది.
ఆ సినిమా గురించి అభిరామి మాట్లాడుతూ.. మంచి పాత్రలు చేయాలని వుంది. కథ బావుంటే చిన్నా పెద్ద అనే తేడా లేకుండా చేస్తాను. తమిళ్ లో హీరోయిన్ గా రెండు సినిమాలు చేస్తున్నాను. త్వరలో విలన్ గా కూడా కనిపించబోతున్నా. నన్ను నేను తెరపై కొత్తగా ఆవిష్కరించుకోవాలని ప్రయత్నిస్తున్నా’ అని చెప్పుకొచ్చింది అభిరామి. ‘భలే ఉన్నాడే’ ఈనెల 13న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.