కేరళలో దారుణం చోటు చేసుకుంది. హీరోయిన్ భావన ను కిడ్నాప్ చేసి.. లైంగిక వేధింపులకు తెగబడ్డారు దుండగులు. కేరళలోని ఎర్నాకుళంలో జరిగిన ఈ ఘటన పెను కలకలం రేపుతోంది. పోలీసులు కధనం ప్రకారం కేరళలోని ఎర్నాకుళంలో ఓ సినిమా షూటింగ్ ముగించుకొని ఇంటికి తిరిగి వస్తుండగా కొందరు దుండగలు భావన కారును అడ్డుకుని బలతంగా దారిమళ్ళించారు. సినీ పక్కీలో కదులుతున్న కారులో ఆమెను లైంగిక దాడి చేశారు. అనంతరం పలరివత్తమ్ ప్రాంతంలో కారును వదిలేసి పరారయ్యారు.
స్వయంగా భావనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేసింది. ఈ దారుణానికి వడికట్టింది భావన కారు డ్రైవరేనట. అతడి పేరు మార్టిన్. పక్కా స్కెచ్ ప్రకారం మరో ముగ్గురుని ముందుగానే పురమాయించిన మార్టిన్ కారును దారి మళ్లించి కదులుతున్న కారులోనే ఆమె పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాదు ఆ లైంగిక దాడిని వీడియో కూడా తీశారట దుండగులు ఈ విషయాన్ని భావనే పోలీసులకు వెల్లడించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలింపు మొదలుపెట్టారు. మళయాళీ నటి అయిన భావన తెలుగులో కృష్ణ వంశీ మహాత్మ సినిమాలో నటించింది.
ఈ దారుణ ఘటనతో సినీ పరిశ్రమే కాదు యావత్ దేశం షాక్ కు గురౌతోంది.