టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ నడుస్తోంది. ఇన్నాళ్లూ హీరోలంటే.. ఒకరిమీద ఒకరు పోటీలు పడుతూ.. ఎదుటివారి కంటే పెద్ద హిట్ కొట్టాలని తపిస్తుంటారు. అందుకు తగ్గ కథల కోసం అన్వేషిస్తుంటారు. కానీ.. ఇప్పుడు ఆ పోటీ అలాగే ఉన్నా.. ప్రమోషన్ విషయంలో కొత్త మార్గం కనిపెట్టారు హీరోలు.
గిల్లికజ్జాలు పెట్టుకోకుండా.. ఒకరికి మరొకరు సహకరించుకోవడమే దాని సారాశం. టాప్ హీరోలుగా ఉన్న వారంతా ఈ ఫార్ములాని ఫాలో అవుదామని ఫిక్స్ అయినట్టు ఫిలింనగర్ టాక్. రామ్ చరణ్ తేజ్, అల్లు అర్జున్, రానా, ఇతర హీరోలు అందరూ ఓ మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఒకరికొకరు సహకరించుకోవాలని నిర్ణయించారట.
ఈ ఒప్పందంలో భాగంగా.. ఒకరి సినిమాలను మరొకరు ప్రమోట్ చేస్తున్నారు. ఎవరి సినిమా బావున్నా.. వెంటనే మిగిలిన ఫ్రెండ్స్ కూడా ట్వీట్ చేయడమో, ప్రివ్యూలకి వెళ్లి మెచ్చుకోవడమే చేసేయాలని డిసైడయ్యారు. అంతే కాదు.. ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న పైరసీ మీద పోరాటం చేయడానికి ఒక్కమాట మీద ఉండాలని భావిస్తున్నారు.