‘ఓకే బంగారం’తో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకొన్నాడు సల్మాన్ దుల్కార్. ఫిదాతో ఇక్కడి అబ్బాయిల్ని ఫిదా చేసేసింది సాయిపల్లవి. వీరిద్దరూ కలిసి నటించిన మలయాళ చిత్రాన్ని రీమేక్ చేయడానికి అంత కంటే… అర్హత ఏముంటుంది?? అందుకే ఓ డబ్బింగ్ సినిమాని ‘హేయ్ పిల్లగాడా’ పేరుతో తెలుగులోకి తీసుకొస్తున్నారు. ‘ఫిదా’లో పాపులర్ పాట తొలి పదం ఇది. అందుకే… క్యాచీగా, వినగానే నచ్చేలా ఉంది. ట్రైలర్ ఇప్పుడు విడుదలైంది. ట్రైలర్ అంతా… హీరో క్యారెక్టరైజేషన్ ని బేస్ చేసుకొని కట్ చేశారు. అతనికి ముక్కుమీద కోపం. దాని వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయో.. ఈ ప్రేమ కథ ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే సినిమా.
‘హేయ్ పిల్లగాడా’ కి ప్రధాన ఆకర్షణ సాయిపల్లవినే. సాయి పల్లవి కంటే సల్మాన్ పై ఫోకస్ పెట్టడం ఆశ్చర్యపరుస్తుంది. టైటిల్ చూసి ఇదో రొమాంటిక్ సినిమా అనుకొంటే… దాన్ని యాక్షన్ మూడ్‌లోకి తీసుకెళ్లిపోయారు. ట్రైలర్ కట్ చేసిందెవరో గానీ.. తెలుగు ప్రేక్షకుల అభిరుచిని, ఇక్కడ సాయి పల్లవికి వచ్చిన ఇమేజ్‌నీ దృష్టిలో పెట్టుకోలేదని పిస్తోంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, యాక్షన్ సీక్వెన్స్, సీరియెస్ డ్రామాని పక్కన పెట్టి, టైటిల్‌కి తగ్గట్టు ట్రైలర్‌ని రొమాంటిక్‌గా కట్ చేస్తే బాగుండేదేమో.