కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ కలలు.. కల్లలయ్యే షాక్ ఇచ్చారు… స్పీకర్ సురేష్ కుమారు. ఆయన అనూహ్యంగా ముగ్గురు రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు వేశారు. అయితే ఈ అనర్హతా వేటు మామూలుగా లేదు. మళ్లీ వాళ్లు ఉపఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం లేనంతగా వేశారు. మళ్లీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే వారికి పోటీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుత శాసనసభలో ఏ రూపంలోనూ… అనర్హతా వేటు పడిన ముగ్గురు ఎమ్మెల్యేలు.. అడుగు పెట్టడానికి అవకాశం లేకుండా రమేష్ కుమార్ వేటు వేశారు. స్వతంత్రంగా గెలిచి.. తర్వాత కాంగ్రెస్‌లో కలిసినట్లుగా.. స్పీకర్‌కు లేఖ ఇచ్చిన ఆర్. శంకర్ … మొన్నటి ఓటింగ్ కు గైర్హాజర్ అయ్యారు. ఆయన బీజేపీ క్యాంప్‌లో ఉన్నారు. ఆయనపై అనర్హతా వేటు వేశారు. అలాగే.. కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు రమేష్ జార్కిహోళి, మహేష్ కుమటల్లిలపైనా ఈ అనర్హతా వేటు వేశారు.
బీజేపీకి మద్దతు పలికి.. మంత్రి పదువులు పొందుదామనుకున్న వీరికి … ఇది భారీ షాకే. ఎందుకంటే.. ఇప్పుడు మంత్రి పదవి కాదు కదా..కనీసం..తాము గెలిచిన నియోజకవర్గం నుంచి మళ్లీ ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి కూడా అవకాశం లేదు. నాలుగేళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే వారు పోటీ చేయగలరు. కాంగ్రెస్ పార్టీ అత్యంత వ్యూహాత్మకంగానే… స్పీకర్‌తో.. ఈ రకమైన చర్యలు తీసుకుందనే అభిప్రాయం ఏర్పడుతోంది. స్పీకర్ చర్య కచ్చితంగా..క్యాంపులో ఉన్న ఇతర రెబల్ ఎమ్మెల్యేలను భయపెడుతుంది. స్పీకర్..రాజీనామాలు ఆమోదిస్తారా…లేక… అనర్హతా వేటు వేస్తారా.. అన్నది.. ఆయన ఇష్టం. ఆ విషయంలో సంపూర్ణ హక్కులు ఉన్నాయి. న్యాయస్థానాల్లోనూ సవాల్ చేసే పరిస్థితి లేదు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ కిందనే అనర్హతా వేటు వేస్తున్నట్లుగా.. ఆదేశాల్లో చెబుతున్నందున.. ఇక తిరుగులేనట్లే.
తమపై అనర్హతా వేటు వేస్తే… మంత్రి పదవి సంగతి దేవుడెరుగు.. అసలు ఎమ్మెల్యే పదవికే ఎసరు వచ్చి పడుతుందని.. రెబల్ ఎమ్మెల్యేల్లో భయం ప్రారంభమైతే.. వారంతా వెనక్కి రావడం ఖాయంగా జరుగుతోంది. ఆరేడుగురు వెనక్కి వచ్చినా… బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అసాధ్యమవుతుంది. మరో వైపు.. కాంగ్రెస్ నేతలు… ఈ సారి జేడీఎస్ మద్దతుతో తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న వ్యూహరనచ చేస్తున్నారు. కుమారస్వామి కూడా.. ఈ విషయంలో పట్టుదలగా ఉన్నారంటున్నారు. రెబల్ ఎమ్మెల్యేల్లో పలువురితో సన్నిహిత సంబంధాలున్న…కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే రామలింగారెడ్డితో.. కుమారస్వామి చర్చలు జరిపారు. మరో వైపు.. డీకే శివకుమార్ తెర వెనుక ప్రయత్నాలు చురుగ్గానే సాగిస్తున్నారు. మొత్తానికి కర్ణాటకం రాబోయే రోజుల్లో మరిన్ని మలుపులు తిరగడం ఖాయంగా కనిపిస్తోంది.