నానితో గొడ‌వ‌… క్లారిటీ ఇచ్చిన ద‌ర్శ‌కుడు

కొత్త దర్శ‌కుడితో సినిమా అంటే హీరోలు ఇంకాస్త ఎక్కువ స్పేస్ తీసుకొంటుంటారు. త‌మ‌కు కావ‌ల్సిన‌ట్టుగా క‌థ‌, క‌థ‌నాల్ని మ‌ల‌చుకొంటుంటారు. ద‌ర్శ‌కులు కూడా హీరోల అనుభ‌వాన్ని న‌మ్మి తీరాల్సిందే. వాళ్ల‌కు త‌లొంచాల్సిందే. అయితే కొన్ని చోట్ల మాత్రం ఆర్గ్యుమెంట్లు మొద‌లైపోతాయి. దాంతో సెట్స్‌పై ఉన్నప్పుడే హీరోకీ, ద‌ర్శ‌కుడికీ మ‌ధ్య క్లాష్ వ‌స్తుంటుంది. `హాయ్ నాన్న‌` విష‌యంలోనూ ఇదే జ‌రిగిందని, ఆ సినిమా ద‌ర్శ‌కుడు శౌర్య‌వ్‌కీ నానీకి చిన్న చిన్న ఈగో క్లాషులు వ‌చ్చాయ‌ని ఇండ‌స్ట్రీలో ఓ టాక్ వినిపిస్తోంది. దీనిపై శౌర్య‌వ్ క్లారిటీ ఇచ్చేశాడు.

”నానికీ నాకూ గొడ‌వ జ‌రిగింద‌న్న మాట‌ల్లో ఎలాంటి నిజం లేదు. మా ప‌ని మేం ప్ర‌శాంతంగా చేసుకొంటూ వెళ్లిపోయాం. సెట్లో ఏం తీయాలి? అనే విష‌యంపై నాకు క్లారిటీ ఉంది. నాని న‌న్ను న‌మ్మారు. ఇంక గొడ‌వ‌కు ఆస్కారం ఏముంటుంది? ఇదో ఫీల్ గుడ్ మూవీ. మేం కూడా అలాంటి ఫీల్ తోనే ప‌ని చేశాం. ద‌ర్శ‌కుల‌కు ఎక్కువ స్పేస్ ఇస్తుంటారు నాని. అందుకే కొత్త ద‌ర్శ‌కులు ఆయ‌న‌తో అంత‌లా మింగిల్ అవుతుంటారు” అని ఈ రూమ‌ర్స్‌ని కొట్టి ప‌డేశారు. శౌర్య‌వ్ కి ఇదే తొలి సినిమా. ఈనెల 7న `హాయ్ నాన్న‌` విడుద‌ల అవుతున్న సంగ‌తి తెలిసిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close