అజ్ఞాత వాసి ఫస్ట్ లుక్ ఎంత ఆకట్టుకొంటోదో.. ఈ టైటిల్‌కి ఇచ్చిన క్యాప్షన్ అంత ఆశ్చర్యపరుస్తోంది. ‘ప్రిన్స్ ఇన్ ఎక్సిల్’ అనేది దీని క్యాప్షన్. అది కాస్త గంభీరంగానే కనిపిస్తున్నా.. లోలోపల చాలా అర్థం ఉంది. దేశ బహిష్కరణకు గురైన రాజకుమారుడు అని దీని అర్థం. పరదేశి, దేశ భ్రష్టుడు, దేశం నుంచి వెలివేసినవాడు… అనే అర్థాలు కూడా ఉన్నాయి. మొత్తానికి అజ్ఞాతవాసి అనే టైటిల్‌కి సరైన క్యాప్షనే దొరికింది. నిజానికి ఈ టైటిల్ కంటే ముందు.. పరదేశి అనే పేరు అనుకొన్నారు. టైటిల్, క్యాప్షన్‌ని బట్టి చూస్తే.. ఎక్కడి నుంచో ఇండియాకి వచ్చి, ఇక్కడ.. కొన్ని పనులు చక్క బెట్టే కథానాయకుడి పాత్రలో పవన్ కనిపిస్తారన్నది స్పష్టం అవుతుంది. కాకపోతే ఈ క్యాప్షన్‌లోనే మసాలా అద్దుకోవడానికి కొంత మేటర్ దొరుకుతోంది. ‘దేశ బహిష్కరణ’ అనే పదాన్ని పట్టుకొని నానార్థాలు తీయడానికి చాలామంది ఈపాటికి సిద్ధమయ్యే ఉంటారు. దేశం అంటే ‘తెలుగుదేశం’ అని కలరింగు ఇచ్చినా ఇవ్వొచ్చు. పవన్‌కీ తెలుగు దేశానికీ చెడిపోయిందని, అందుకే దాన్నిసూచిస్తూ ఈ క్యాప్షన్ పెట్టారన్న గుసగుసలు వినిపించాయంటూ వార్తలొచ్చినా ఆశ్చర్యం లేదు. చూద్దాం.. గాసిప్ వీరులు ఎలాంటి వార్తల్ని వండి వారుస్తారో..