అమెరికాకు చెందిన ఇన్వెస్టిగేటివ్ రీసెర్చ్ , షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బెర్గ్ ను మూసి వేస్తున్నట్లుగా ఆ కంపెనీ ఫౌండర్ ప్రకటించారు. ఈ సంస్థ వివిధ కంపెనీల్లో అవకతవకల్ని బయట పెట్టడంలో కీలక పాత్ర పోషిస్తోంది. భారత్ లోనూ ఈ సంస్థ పాపులర్ అయింది. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బెర్గ్ చేసిన ఆరోపణలు వల్ల, ఆ గ్రూపుకు లక్షల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది. హిండెన్‌బెర్గ్ రీసెర్చ్ రిపోర్ట్‌పై అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
హిండెన్‌బెర్గ్ సంస్థ అదానీ కంపెనీలపై తీవ్ర ఆరోపణలు చేసింది, ఆఫ్‌షోర్ సంస్థల్లో పెట్టుబడులు చేసింది, భారత్‌కు సంబంధించి సంచలన విషయాలను బయట పెట్టింది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ కంపెనీని నాథన్ ఆండర్సన్ అనే వ్యక్తి స్థాపించారు. ఇది ఫోరెన్సిక్ ఫైనాన్షియల్ రీసెర్చ్ సంస్థ, కార్పొరేట్ మోసాలు వెలికితీయడంలో దీని ప్రత్యేకత అని చెప్పవచ్చు. 2017లో స్థాపించిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ప్రపంచ వ్యాప్తంగా పలు స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయిన కంపెనీలు పాల్పడిన అవకతవకలను బయటపెట్టింది.
హిండెన్ బర్గ్ రీసెర్చ్ ద్వారా మార్కెట్లో షార్ట్ సెల్లింగ్ ప్రోత్సహిస్తుంది. షార్ట్ సెల్లర్ ముందుగా తన వద్ద షేర్లు లేకపోయినప్పటికీ సెక్యూరిటీ మార్కెట్ల వద్ద అప్పుగా తీసుకుంటాయి. అవకతవకలు బయట పడినప్పుడు ఎంపిక చేసుకున్న స్టాక్స్ భారీ మొత్తంలో పతనం అయిన తర్వాత వాటిని తక్కువ ధరకు కొనుగోలు చేస్తారు.అప్పుగా తీసుకున్న షేర్లను బ్రోకర్లకు ఇచ్చేసి లాభం పొందుతారు.ఇదో క్లిష్టమైన ప్రక్రియ. అయితే దీని ద్వారా పెద్దఎత్తున హిండెన్ బెర్గ్ లాభాలు పొందింది.
తన సంస్థను మూసివేయడానికి ఎలాంటి ఒత్తిళ్లు లేవని భవిష్యత్ వ్యూహాల కోసం మూసి వేస్తున్నట్లుగా హిండెన్ బెర్గ్ ఫౌండర్ నాథన్అండర్సన్ చెబుతున్నారు.