పార్టీలో ఉంటే ఉండే పోతే పో అని చాలా ఘాటుగా చండూరు సభలో అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్.. సున్నితమైన భాషలో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పంపుతోంది. కోమటిరెడ్డి తాను ఫీలయ్యానని రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని రెండు సార్లుడిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి కూడా తాను తగ్గి.. కోమటిరెడ్డికి క్షమాపణలు చెప్పారు.అయితే చెప్పిన తర్వాత క్షమాపణలు సరిపోవని.. కోమటిరెడ్డి గేమ్ ప్రారంభించారు. దీందో హైకమాండ్‌కు లైట్ వెలిగింది.
పార్టీ కోసం పని చేయాలన్న ఉద్దేశం ఆయనకు లేదని.. పార్టీని బలహీనం చేసే ఉద్దేశంతోనే… వ్యూహాత్మకంగా గేమ్ ఆడుతున్నారన్న అంచనాకు వచ్చారు. కోమటిరెడ్డికి మునుగోడు బాధ్యతలివ్వాలని అనుకుంటున్నా.. సోదరుడికి వ్యతిరేకంగా పని చేసేందుకు ఆయనకు సిద్ధంగా లేరు. దీంతో ఏఐసిసీ కార్యదర్శుల స్థాయి నేతలు కోమటిరెడ్డి వ్యవహారంపై చర్చిస్తున్నారు. ఆయనకు పార్టీలో ఉంటే.. చెప్పినట్లు ఉండు.. లేకపోతే నువ్ కూడా పో అనే సంకేతాలను పపాలని నిర్ణయించారు.
నిజానికి కోమటిరెడ్డి కోరుకుంటున్నది కూడా ఇదే. తనను గెంటేస్తే.. తాను వెళ్లిపోలేదని.. గెంటేశారని చెప్పుకోవచ్చు. సానుభూతి పొందవచ్చు. ఈ ప్లాన్ హైకమాండ్‌కు అర్థమైంది. అందుకే కోమటిరెడ్డి విషయంలో భిన్నమైన ప్లాన్ అమలు చేయాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. మునుగోడు ఎన్నికల్లో వచ్చే ఫలితాన్ని బట్టి రాజకీయ భవిష్యత్ నిర్ణయించుకోవాలని కోమటిరెడ్ిడ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.అయితే ఆయనకు అంత చాయిస్ ఇవ్వకూడదని కాంగ్రెస్ అనుకుంటోంది.