విశాఖ వాల్తేరు క్లబ్ భూముల వ్యవహారంలో ఏపీ సర్కార్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఎలాగైనా క్లబ్‌ను స్వాధీనం చేసుకుని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌లో కీలక భాగాన్ని అందులో ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం ప్రయత్నాలుక హైకోర్టు బ్రేక్ వేసింది. ఆ భూములపై సిట్ విచారణను నిలుపుదలచేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తమ భూములపై సిట్‌కు విచారించే అధికారం లేదని వాల్తేర్ క్లబ్ పిటిషన్ వేసింది. ఇది సివిల్ వివాదం అయినందున.. సిట్ జోక్యం చేసుకోవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. విశాఖలో వాల్తేర్ క్లబ్ అత్యంత ప్రతిష్టాత్మకమైనది. నగరం నడిబొడ్డున ఉంటుంది.
క్లబ్‌కు చెందిన భూములపై ప్రస్తుత ప్రభుత్వం కన్నేసింది. విశాఖలో భూముల ఆక్రమణపై ఏర్పాటైన సిట్‌కు ఓ న్యాయవాది ద్వారా వైసీపీ నేతలు ఫిర్యాదు ఇప్పించారు. ఆ ఫిర్యాదు ఆధారంగా సిట్.. క్లబ్ మేనేజ్మెంట్కు నోటీసులు జారీ చేసి విచారణ ప్రారంభించింది. అది ప్రభుత్వ భూమి అని సిట్ చెబుతోంది. ఈ క్లబ్ భూములు తమవంటూ కొంత మంది తెరపైకి వచ్చారు. వీరందరితో సిట్ విచారణ నిర్వహిస్తోంది. ఇదంతా కుట్ర పూరితంగా ఉందని.. ఎలాగైనా స్వాధీనం చేసుకునే ఉద్దేశంతోనే ఉన్నారని అనుమానించిన వాల్తేరు క్లబ్ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది.
విశాఖ సిటీలోని సిరిపురంలో 31.07 ఎకరాల భూమిల వాల్తేరు క్లబ్ఉంది. 1895 నుంచి భూమి వారి అధీనంలోనే ఉంది. 1983లో వాల్తేరు క్లబ్ దగ్గరున్న భూమిలో 16 ఎకరాలను వుడా వివిధ అవసరాల కోసం సేకరించింది. పరిహారంగా కొంతమొత్తం చెల్లించింది. ఈ భూమిపై వివాదాలు అప్పటి నుండి ఉన్నాయి. కేసులు కోర్టుల్లో ఉన్నాయి. దీంతో ఈ వాల్తేర్ క్లబ్‌పై ప్రభుత్వం దృష్టి పడింది. గవర్నర్ బంగ్లాగా బాగా ఉపయోగపడుతుందనుకుంటున్న ప్రభుత్వ పెద్దలు.. సిట్ ద్వారా ప్రయత్నాలు చేశారు. అయితే సివిల్ వివాదం కావడంతో… హైకోర్టు విచారణపై స్టే ఇచ్చింది.