తెలుగుదేశం పార్టీ హయాంలో పని చేసిన కీలక అధికారులపై నమోదు చేసిన కేసులన్నీ తేలిపోతున్నాయి. తాజాగా ఐఆర్ఎస్ ఆధికారి జాస్తి కృష్ణకిషోర్‌పై సీఐడీ పెట్టిన కేసులన్నీ తప్పుడువనీ హైకోర్టు తేల్చి చెప్పింది. పూర్తి విచారణ తర్వాత ఎక్కడా ఈడీబీ సీఇవోగా కృష్ణ కిషోర్ ఎక్కడా అక్రమాలకు పాల్పడలేదని పేర్కొంది.కృష్ణ కిషోర్ వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకున్నట్లు గానీ, లాభ పడినట్లు గాని ఎక్కడా ఆధారాలు లేవని తేల్చి చెప్పింది. సీఎం జగన్‌పై కేసులను దర్యాప్తు చేసిన నాటి సీబీఐ అధికారి లక్ష్మీనారాయణతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే కారణంగా, దురుద్దేశపూర్వకంగా ఐఆర్ఎస్ అధికారిపై కేసు పెట్టినట్లు ధర్మాసనం నిర్థారించింది.
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏపీఈడీబీ సీఈవోగా ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడంతో జాస్తి కృష్ణకిషోర్ ప్రధాన పాత్ర పోషించారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత ఆయనపై అక్రమ కేసులు పెట్టారు. ఎప్పట్లాగే సీఐడీని ఇందుకు ఉపయోగించుకున్నారు. క్రిమినల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి సస్పెండ్ చేసింది. తర్వాత జాస్తి కృష్ణకిషోర్ క్యాట్ కు వెళ్లి సస్పెన్షన్ పై స్టే తెచ్చుకున్నారు. కేంద్ర ప్రభుత్వంలో కీలక శాఖకు బదిలీ అయ్యారు. ఇప్పుడు ఆయనపై పెట్టి నఅక్రమ కేసు అని హైకోర్టు స్పష్టం చేసింది.
ఎలాంటి ఆధారాలు లేకుండా ఉద్దేశపూర్వకంగా పెట్టిన తప్పుడు కేసుగా హైకోర్టు తేల్చడం.. ప్రతీకారం కోసమే ఇలా చేశారని స్పష్టం కావడంతో తప్పుడు కేసులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అధికారం అందగానే ఎలాంటి ఆధారాలు లేకపోయినా చాల మందిని కసికొద్దీ తప్పుడు కేసులు జైల్లో పెట్టారు. ఇప్పుడు ఆ కేసులన్నీ విచారణకు రానున్నాయి. జాస్తి కేసులో కనీస ఆధారాలు సమర్పించడంలో సీఐడీ విఫలమైంది. ఫిర్యాదు చేసిన వారిపై.. కనీస సాక్ష్యాలు లేకుండా కేసులు పెట్టిన వారిపై.. న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న వాదన వినిపిస్తోంది.