నెయ్యి కన్నా పందికొవ్వే చాలా ఖరీదైనదని చెప్పగలిగే , వాదించగలిగే తెలివి తేటలు ఉన్న వైసీపీ ప్రదాన కార్యదర్శి, మాజీ ప్రభుత్వ ఏఏజీ.. బీభత్సమైన లాయర్‌గా గుర్తింపు తెచ్చుకున్న పొన్నవోలు సుధాకర్ రెడ్డికి హైకోర్టులో షాక్ తగిలింది. ఆయన పిటిషన్ న హైకోర్టు కొట్టి వేసింది. ఇంతకీ ఆయన వేసిన పిటిషన్ ఏమిటంటే.. తనకు ప్రాణహాని ఉందని భద్రత కావాలని పిటిషన్ వేయడం.
పొన్నవోలు వేసిన భద్రతా పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు .. ఏ కోణంలో చూసినా ఆయనకు ముప్పు లేదని .. భద్రతపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. భద్రతకు ఫలానా విధంగా సమస్య ఉందని పొన్నవోలు కోర్టు ముందు ఆధారాలతో సహా నిరూపించలేకపోయారు. తన వాదనల్లో పస ఉందని చెప్పుకోలేకపోయారు. ఫలితంగా పిటిషన్ ను కొట్టి వేస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. అసలు పొన్నవోలుకు ఎందుకు భద్రత ఎందుకన్నది ఆయనకు కూడా తెలియదు.
గతంలో పొన్నవోలు సుధాకర్ రెడ్డి చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు కోర్టు ఎదుట వాదనలు వినిపించారు. అప్పుడు న్యాయస్థానం రిమాండ్ విధించింది. అదీ తన వాదనా పటిమ ఆయన ఎక్కడికో వెళ్లిపోయారు. అయితే ఇప్పుడు తనకు భద్రత అవసరమే అని ఆయన వాదించుకోలేకపోవడంతో ఆయన పరువు పోయినట్లయింది.