టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం ఆయన రాజమండ్రి ఆస్పత్రిలో ఉన్నారు. సంగం డెయిరీ చైర్మన్‌గా ఉన్న ఆయన అవకతవకలకు పాల్పడ్డారంటూ… గత నెల ఇరవై మూడో తేదీన తెల్లవారుజామునే ఆయన ఇంటికి వెళ్లి ఏసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎలాంటి నోటీసులు లేకుండా అప్పటికప్పుడు అరెస్ట్ చేసి.. తీసుకెళ్లిపోయారు. అప్పట్నుంచి ఆయన జైల్లో ఉన్నారు. పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. కింది కోర్టు ఆయన బెయిల్ పిటిషన్ కోర్టు కొట్టి వేయడంతో హైకోర్టుకును ఆశ్రయించారు. పోలీసులు కస్టడీకి తీసుకున్న సమయంలో ఆయనకు కరోనా సోకింది. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. నెగెటివ్ రాగానే మళ్లీ వెంటనే. కోర్టుకు సమాచారం ఇవ్వకుండానే జైలుకు తరలించారు.
దీనిపై ఏసీబీ కోర్టు… పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వైద్యులు ఐసోలేషన్‌లో ఉండాలని సలహా ఇచ్చినా కోర్టుకు తరలించడంపై మండిపడింది. ఆయనను మళ్లీ ఆస్పత్రికి తరలించాలని ఆదేశించింది. అప్పట్నుంచి రాజమండ్రి ఆస్పత్రిలోనే ఉన్నారు. ఇప్పుడు బెయిల్ మంజూరైంది. ధూళిపాళ్లతో పాటు.. సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్‌కు కూడా బెయిల్ మంజూరైంది. ధూళిపాళ్లను జైల్లో ఉంచిన ఈ నెల రోజుల్లో సంగం డెయిరీలో చాలా వ్యవహారాలు జరిగాయి. సోదాల పేరుతో.. సంస్థకు చెందిన మార్కెటింగ్ సమాచారాన్ని మొత్తం చోరీ చేశారన్న ఆరోపణలు వినిపించాయి.
ఏసీబీ అధికారులు అమూల్‌కు చెందినప్రైవేటు వ్యక్తులను తీసుకొచ్చి సర్వర్లను తనిఖీ చేశారని.. వాటిని తీసుకెళ్లే ప్రయత్నం చేశారని సంగం డెయిరీ ఉద్యోగులు ఆరోపించారు. అలాగే. సంగం డెయిరీనిప్రభుత్వ అధీనంలోకి తీసుకుంటూ జీవో కూడా ఇచ్చారు. కానీ హైకోర్టు దాన్ని కొట్టవేసింది దాంతో.. సంగం డెయిరీని డైరక్టర్లే నిర్వహిస్తున్నారు. మొత్తం సంగం డెయిరీ విషయంలో ప్రభుత్వం ధూళిపాళ్ల నరేంద్రను జైల్లో పెట్టగలగడం.. కీలకమైన సమాచారాన్ని సేకరించడం… రైతుల్లో ఆందోళనలు సృష్టించడం లాంటి లక్ష్యాలను సాధించిందని… నరేంద్ర వర్గీయులు అంటున్నారు.