టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఒక కేసు తర్వాత మరో కేసు .., రవిప్రకాష్‌పై నమోదు చేసి…పోలీసులు జైల్లో ఉంచడంపై… విచారణలో రెండు సార్లు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తుది విచారణలో బెయిల్ మంజూరు చేసింది. టీవీ9 సీఈవోగా ఉన్న సమయంలో అక్రమంగా బోనస్ తీసుకున్నారంటూ.. కొత్త యాజమాన్యం పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకు.. ఈ నెల ఐదో తేదీన రవిప్రకాష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటికే ఎలాంటి నోటీసులు ఇవ్వకపోయినప్పటికీ… విచారణకు సహకరించడం లేదన్న కారణం చెప్పి అరెస్ట్ చేసి.. రిమాండ్‌కు పంపించారు. శనివారం.. దసరా సెలవులు ఉండటంతో.. వ్యూహాత్మకంగా ఎక్కువ రోజులు రవిప్రకాష్‌ను జైల్లో ఉంచేందుకు ఆ రోజున అరెస్ట్ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత అదే కేసులో కస్టడీ కోసం కోర్టులో పిటిషన్ వేశారు.
రవిప్రకాష్‌ను కస్టడీకి తీసుకనేంత నేరం అందులో ఏముందన్న వాదనలు.. రవిప్రకాష్ న్యాయవాదులు కోర్టులో వినిపించారు. పోలీసులు కూడా.. కస్టడీకి తీసుకుని.. ఏం సమాచారం రాబడతారో.. చెప్పలేకపోవడం… కేసులో దురుద్దేశాలున్నాయని వస్తున్న ఆరోపణలకు నేరుగా సమాధానం ఇవ్వలేకపోయారు. దాంతో.. కోర్టు రవిప్రకాష్ కస్టడీకి ఇవ్వడానికి నిరాకరించింది. దాంతో . రవిప్రకాష్‌కు బెయిల్ రావడానికి మార్గం సుగమం అయింది. వారం రోజుల కిందట.. రవిప్రకాష్‌కు ఇక బెయిల్ రావడం … లాంఛనమే అనుకుంటున్న సమయంలో… హఠాత్తుగా నకిలీ ఈమెయిల్ సృష్టించారంటూ.. మరో కేసు నమోదు చేసి.. పీటీ వారెంట్‌పై.. అరెస్ట్ చేశారు. దాంతో… బోనస్ కేసులో బెయిలొచ్చినప్పటికీ.. రవిప్రకాష్ జైల్లో ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు.. మిగతా కేసుల్లోనూ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
రవిప్రకాష్ వేసిన పిటిషన్లపై విచారణ సమయంలో హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఓ మనిషిని ఇంత తీవ్రంగా హింసిస్తారా.. అని ఆశ్చర్యపోయింది. పోలీసులు ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నారన్నట్లుగా విమర్శలు చేసింది. గట్టిగా.. మూడేళ్లు కూడా శిక్ష పడని కేసులు పెట్టి.. జీవితాంతం జైల్లో ఉండేలా చేయాలనుకుంటున్నారా.. అని ప్రశ్నించింది. టీవీ9 కొత్త యజమాన్యంతో ఏర్పడిన వివాదాలపై . ఇప్పటికే.. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో విచారణ జరుగుతోంది. అయితే.. అధికార పెద్దలతో ఉన్న సన్నిహిత సంబంధాలతో.. రవిప్రకాష్‌ను.. కొత్త యాజమాన్యం ఇబ్బంది పెట్టేందుకే అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని.. ఆయన వర్గీయులు ఆరోపిస్తున్నారు.