వైసీపీ నేతలు ప్రాక్టీస్ చేసి మరీ తమ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలను జైలుకు పంపుతున్నారు. ఒక్కో కేసు కాకుండా అసలు సోషల్ మీడియా పోస్టులపై కేసులు పెట్టకుండా చేయడానికి విజయబాబు అనే జర్నలిస్ట్ టర్న్డ్ పొలిటీషియన్తో హైకోర్టులో ఓ పిటిషన్ వేయించారు. ఆ పిటిషన్ సారాంశం ఏమిటంటే.. సోషల్ మీడియా ఎలాంటి పోస్టులు పెట్టినా భావ ప్రకటన స్వేచ్చగానే చూడాలని కేసులు పెట్టకూడదని ఆయన వాదన. అయితే హైకోర్టు కేసులు పెడితే తప్పేమిటని ప్రశ్నించింది. గతంలో న్యాయమూర్తులపైనా తప్పుడు పోస్టులు పెట్టారని గుర్తు చేసింది. కేసుల వారీగా ఏమైనా అభ్యంతరాలు ఉంటే కోర్టుకు రావాలని చెప్పింది.
దీంతో వైసీపీ సోషల్ మీడియాకు కొత్త కష్టం వచ్చి పడింది.తమపై పెడుతున్న కేసుల విషయంలో హైకర్టుకు వెళ్లి మరీ వైసీపీ సర్టిఫికెట్ తెచ్చినట్లుగా అయింది. అసలు ఈ పరిస్థితి రావడానికి కూడా వైసీపీనే కారణం. అధికారంలో ఉన్నప్పుడు కన్నూమిన్నూ కానరాకుండా పెట్టిన పోస్టుల వల్ల .. అదీ కూడా న్యాయమూర్తులపై కూడా పెట్టిన పోస్టుల వల్లే ఈ సమస్య వచ్చింది. ఓ మాఫియా మాదిరి సోషల్ మీడియా సైన్యాన్ని నడుపుతున్న వైసీపీని ఇప్పుడు పోలీసుల కేసులు చుట్టుముడుతున్నాయి.
గతంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తేనే పోలీసులు అరెస్టు చేసేవారు. బూతులన్నీ వైసీపీ నేతల నుంచే వచ్చేవి. వాటికి తప్పనిసరిగా కౌంటర్ ఇవ్వాల్సిన పరిస్థితిని ఇతరులకు కల్పించారు. ఇప్పుడు అధికారం పోగానే నిండా మునిగిపోతున్నారు. అందుకే ఏది ఇస్తే అది తిరిగి వస్తుందని చెప్పేదని ఇతర పార్టీల్లో సెటైర్లు వినిపిస్తున్నాయి.