తెలంగాణ ఓటర్ల జాబితాను పన్నెండో తేదీన ప్రకటించుకోచ్చని.. హైకోర్టు ఎన్నికల సంఘానికి అనుమతి మంజూరు చేసింది. ఓటర్ల జాబితా పిటిషన్‌పై హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఓటరు నమోదు ప్రక్రియపై అనుమానాలు ఉన్నాయన్న చీఫ్ జస్టిస్ వ్యాఖ్యనించారు. ఓటరు నమోదుకు ఎలాంటి ప్రాతిపదికలు ఉన్నాయని .. వీటన్నింటిపై పూర్తి వివరణ ఇవ్వాలని ఈసీని హైకోర్టు ఆదేశించింది. ఓటర్ల జాబితా బూత్ స్థాయి లిస్టు ఇవ్వాలని ఆదేసించింది. అయితే.. ఈనెల 12న ఓటర్ లిస్ట్ ప్రకటించుకోవచ్చని స్పష్టం చేసింది. అభ్యంతరాలు ఎలా నివృత్తి చేస్తారో…అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 12కు వాయిదా వేసింది.
వాదల్లో.. ఈసీ తరపున న్యాయవాది పిటిషన్‌లోని ఒక్క అంశం కూడా చెల్లదని వాదించారు. కోర్టులో పిటిషనర్ సమర్పించిన జాబితాలో తప్పులు ఉన్నాయన్నారు. 2016-2017 ఓటర్ల లిస్ట్‌ను కూడా ఇప్పుడు చూపిస్తున్నారని వాదించారు. ఓటర్ల జాబితాలో ఏమైనా లోటుపాట్లు ఉంటే సరిచేస్తామని వాదించారు. ఒకే అడ్రస్‌తో వేల ఓట్లు ఉన్నాయి పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆధారాలు సమర్పించారు. ఓటర్ల జాబిాతను.. ఈసీ వెబ్సైట్ నుంచి తీసుకుని కోర్టుకు సమర్పించామని స్పష్టం చేశారు. బోగస్ ఓట్లను ఎలా తొలగిస్తారు? .. తొలగించిన ఓట్లను ఎలా కలుపుతారో చెప్పాలన్న పిటిషనర్ తరపు లాయర్ వాదించారు.
ఓటర్ల జాబితాను విడుదల చేసుకోవడానికి.. హైకోర్టు అనుమతి ఇవ్వడంతో సమస్య దాదాపు పరిష్కరమైనట్లే. అయితే ఆ తర్వాత ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉంటే మాత్రం ఇబ్బందికర పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఈ విషయంలో బలమైన వాదనలు వినిపించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అసెంబ్లీ రద్దు చేయడంలో రాజ్యాంగ పద్దతులను పాటించలేదని.. డీకే అరుణ, శశాంక్‌రెడ్డి పిటిషన్లను హైకోర్టు రిజర్వ్‌లో ఉంచింది. దీనిపై పన్నెండో తేదీన హైకోర్టు నిర్ణయం తీసుకోనుది.