తెలంగాణ తుది ఓటర్ల జాబితాను తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ ప్రకటించవద్దని.. హైకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయన్న పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డితో పాటు మరో వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారించింది.
పిటిషనర్ వ్య్కతం చేిసన అభ్యంతరాలు పై సమాధానం చెప్పాలని ఎన్నికల కమిషన్ కి హైకోర్టు ఆదేశించింది. పిటిషన్ వ్యక్తం చేసిన ప్రతి అభ్యంతరాన్ని పరిగణనలోకి తీసుకుని కౌంటర్ దాఖలు చేయమని ఎన్నికల కమిషన్ ను ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది
ఓటర్ ధరఖాస్తుల స్వీకరణ, తొలగింపు ఈ ఏడాది మే ఇరవై ఐదో వరకే చేశారని పిటిషనర్ల తరుపున న్యాయ వాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే … ఓటర్ల జాబితా సవరణ ఇది నిరంతర ప్రకీయా కట్ ఆఫ్ అంటూ లేదు అని కోర్ట్ కి తెలిపిన ఎన్నికల కమిషన్ తరుపు న్యాయవాది వాదించారు. దీని పై పూర్తి వివరాలు తో అఫిడవిట్ ధాఖలు చేసి, మొదటి కాపీ పిటిషనర్ తరుపు న్యాయవాదికి అందించాలని ఎన్నికల కమిషన్ న్యాయవాదిని హైకోర్టు ఆదేశించంది.
ఓటర్ల తాబితాలలో అవకతవకలు ఉన్నాయని లక్షల ఓట్లను తీసేశారని.. డూప్లికేటింగ్ సహా అనేక తప్పులున్నాయని వాదిస్తూ.. మర్రి శశిధర్ రెడ్డి అనేక సార్లు ఈసీకి ఫిర్యాదు చేశారు. కానీ ఈసీ లైట్ తీసుకుంది. దాంతో మర్రి శశిధర్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు.. హైకోర్టులో విచారించాలని ఆదేశించి. ఈ మేరకు హైకోర్టు విచారణ జరిపింది. ఈ నెల 8న కౌంటర్ దాఖలు చేయాలని ఈసీని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఉత్తర్వులు అందే వరకు ఓటర్ల తుది జాబితాను వెబ్సైట్లో పెట్టవద్దని ఆదేశించింది.ఎన్నికల నోటిఫికేషన్‌ను రిట్ పిటీషన్‌కు లోబడి ప్రకటించాలని హైకోర్టు స్పష్టం చేసింది.
మామూలుగా పన్నెండో తేదీన ఈసీ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటిస్తుందన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలో.. ఎనిమిదో తేదీన కోర్టు ఏం చెబుతుందన్నది ఆసక్తికరంగా మారింది.