” మా పాప ఢిల్లీలో చదువుకుంటోంది. మీ రాజధాని ఏదీ అని తోటి విద్యార్థులు ఆటపట్టిస్తున్నారు. తెలుగువారి ఈ దుస్థితి ఎందుకు?” అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద్ ఓ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. కష్టపడి సాధించడంలో తెలుగువారు గుర్తింపు తెచ్చుకున్నారని అందరూ అనుకుంటారు కానీ . ఇప్పుడు మనం ఏం సాధించామని …మన రాష్ట్ర రాజధాని ఇదీ అని చెప్పుకునే పరిస్థితి ఉందా? ఆవేదన వ్యక్తం చేశారు. జస్టిస్ భట్టు దేవానంద్ ఇలా తన ఆవేదనను బహిరంగంగా వ్యక్తం చేశారు. ఆయన న్యాయమూర్తి కాబట్టి ఆయన అభిప్రాయాలకు.. ఆవేదనకు ప్రాధాన్యం లభిస్తోంది. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరిలోనూ ఉండే అభిప్రాయం ఇదే.
ఆంధ్రకు రాజధాని ఏది.. ఏపీకి ఎందుకీ దుస్థితి అనే ఆవేదన దాదాపుగా ప్రతి తెలుగువారిలో ఉంది. అయితే కొంత మంది కులం, మత, ప్రాంత, విద్వేష రాజకీయాల మత్తులో ఉన్నారు. తము ఏమి ఆలోచిస్తున్నారో వారు అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. సోషల్ మీడియా.. రాజకీయ ప్రభావంతో… సొంత రాజధానిపై కులముద్రలు వేసి కుట్రలు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఎక్కువ మంది అభిప్రాయం. ఆవేదన ఇదే. కానీ ఇప్పటికీ కొంత మంది .. రాజధావి విషయంలో వితండ వాదనలు చేస్తూనే ఉన్నారు. గత ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నిర్ణయించినప్పుడు ఒక్కరంటే ఒక్కరూ వ్యతిరేకించలేదు. మా ప్రాంతానికి రాజధాని కావాలని అడగలేదు. ఎందుకం టే రాష్ట్రం మధ్యలో ఉంది కాబట్టి అందరూ అంగీకరించారు.
కానీ ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత సీన్ మారిపోయింది. న్యాయస్థానంలోనూ అమరావతిని నిర్మించాల్సిందేనని స్పష్టం చేస్తే ప్రభుత్వం మాత్రం మూడు రాజధానులే తమ విధానం అంటోంది. దాంతో రాజధాని ఫలానా అని చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రం దిక్కు లేకుండా అయింది. అనేక మంది బహిరంగ వేదికపై ఈ పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు బట్టు దేవానంద్ వ్యక్తం చేశారు. చాలా మంది ఇతర రంగాల వాళ్లకూ అదే అభిప్రాయం ఉన్నా.. అధికార పార్టీ వైపు నుంచి వచ్చే దాడిని చూసి భయపడి నోరు తెరవలేకపోతున్నారు.