ఏపీలో పెద్ద ఎత్తున ప్రజాధనం దోచుకుటున్నారని అనేక అంశాల్లో స్కాములు చోటు చేసుకుంటున్నాయని ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. సీఎం జగన్ సహా పలువురు మంత్రులు, అధికారులు మొత్తం 41 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 14కు వాయిదా వేసింది. అయితే ఈ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని ప్రభుత్వ తరపున అటార్నీ జనరల్ వాదించారు. ప్రజా ప్రయోజనం లేకుండానే పర్సనల్ ఇంటెన్షన్‌తో పిటిషన్ వేశారన్నారు.
కానీ రఘురామ తరపు లాయర్ విచారణ అర్హత ఉందని వాదించారు పిటిషన్‌పై విచారణ చేపడతామని హైకోర్టు తేల్చి చెప్పింది. పిటిషన్ దాఖలు చేయగానే ప్రభుత్వం కొన్ని రికార్డులను ధ్వంసం చేసిందని రఘురామకృష్ణరాజు తరపు లాయర్ హైకోర్టు దృష్టికి తీసుెళ్లారు. ఇందులో ఉన్నతాధికారులు ఉండటంతో అందరికీ నోటీసులు ఇచ్చి వారి అభిప్రాయాలు తెలుసుకుందామని ధర్మాసనం పేర్కొంది. పిల్లో ప్రతి వాదులుగా వున్న అందరికీ మందికి నోటీసులు జారీ చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణ ఈ మేరకు వాయిదా వేసింది. పిటిషన్ దాఖలు చేసిన తర్వాత రికార్డులు ధ్వంసం చేసినట్లుగా రఘురామ తరపు లాయర్ చెప్పడం సంచలనంగా మారింది. ఇసుకకు సంబంధించిన రికార్డులు ఇటీవలి కాలంలో తగులబెట్టిన ఘటన వెలుగు చూసింది.
వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు జగన్ రెడ్డి చేసిన అవినీతిపై విచారణ కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ రావు పిటిషన్ వేశారు. పూర్తి స్థాయిలో ఆధారాలతో పిటిషన్ వేశారు. ఇప్పుడు రఘురామ కూడా అలాంటి పిటిషనే దాఖలు చేశారు. పూర్తి వివరాలతో ఉండటంతో.. తదుపరి విచారణలో హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది కీలకంగా మారింది. ఒక వేళ ప్రభుత్వం మారినా… ఆయా స్కాంలపై విచారణ జరగడానికి అవకాశం ఉంటుంది.