మాజీ మంత్రి విడదల రజనీపై రెండు వారాల్లో కేసు నమోదు చేయాలని పల్నాడు జిల్లా పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోటి అనే టీడీపీ కార్యకర్త విడుదల రజనీ తనను సోషల్ మీడియా కేసులో అరెస్టు చేయించి కొట్టించారని ఆ వీడియోను లైవ్ లో చూశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు పెట్టకపోవడతో ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణజరిపిన హైకోర్టు రెండు వారాల్లో కేసులు పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది.
చిలకలూరిపేట ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షుడు పిల్లి కోటేశ్వరరావు అలియాస్ కోటీ ఉండేవారు. ఓ పోస్టు విషయంలో పోలీసులు తనను ఐదు రోజులపాటు స్టేషన్లో అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలు పెట్టారని కోటి ఆరోపించారు. తనను చిత్రహింసలకు గురిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ మాజీమంత్రి రజనీ, ఆమె వ్యక్తిగత సహాయకులు జయఫణీంద్రకుమార్, రామకృష్ణ, చిలకలూరిపేట అప్పటి సీఐ సూర్యనారాయణపై ఎస్పీ కంచి శ్రీనివాసరావుకు గత ఏడాది నవంబర్ లో ఫిర్యాదు చేశారు. వైసీపీ నాయకులురాలు, మాజీ మంత్రి విడదల రజనీ, చిలకలూరిపేట అప్పటి సీఐ సూర్యనారాయణపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వైసీపీకి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నామంటూ తనను నిర్బంధించి పోలీసులు చిత్రహింసలు పెట్టారని, చిలకలూరిపేట అప్పటి సీఐ తనను కొడుతున్న దృశ్యాలను నాటి మంత్రి విడదల రజనీకి చూపించారన్నారు. అయితే పోలీసులు కేసులు పెట్టలేదు.
విడదల రజనీపై ఎన్నో వివాదాలు ఉన్నాయి. పలువురి దగ్గర డబ్బులు వసూలు చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. దర్యాప్తులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కొొత్తగా ఈ కేసు కూడా నమోదు అయింది. చిలుకలూరిపేటను ఎమ్మెల్యేగా మంత్రిగా ఆమె దోచుకుతిన్నారని ప్రజల్ని పీడించుకుని తిన్నారన్న విమర్శలు ఉన్నాయి. ఆమె గత ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.