ఓ బిడ్డను ప్రమాదంలో కోల్పోయిన తల్లికి వచ్చిన పరిహారంలో సగం డిమాండ్ చేసి వివాదంలో చిక్కుకున్న అంబటి రాంబాబు.. ఇప్పుడు మరో సారి కక్కుర్తి పనికి పాల్పడినట్లుగా తేలింది. ఆయనపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. సత్తెనపల్లిలో వైఎస్ఆర్ సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో చట్ట విరుద్ధమైన స్కీమ్ ను ఇటీవల ప్రారంభించారు. వాలంటీర్లను ఉపయోగించి.. ప్రభుత్వ పథకాలు లబ్ది పొందే వారితో బలవంతంగా టికెట్లు అమ్మించి, డబ్బు వసూలు చేస్తున్నారు.
ఈ స్కీమ్ పూర్తిగా మంత్రి అంబటి రాంబాబు కనుసన్నల్లో జరుగుతోంది. జనవరి 12వ తేదీన డ్రా నిర్వహించి, విజేతలకు డైమండ్ నక్లెస్, రెండు కార్లు, ఒక ట్రాక్టర్, నాలుగు బుల్లెట్లు, ఆరు మోటర్ సైకిళ్లు, 13 ఎల్ఈడీ టీవీలు, 75 మిక్సీలు అందిస్తామని.. ప్రకటించారు. ఒక్కో కూపన్ ధరను రూ. వందగా నిర్ణయించారు. నియోజకవర్గ స్థాయిలో కోటి రూపాయలు లక్కీ డ్రా టికెట్ల ద్వారా వసులు చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. మంత్రి అంబటి రాంబాబు వాలంటీర్లు, వైసీపీ క్యాడర్ కు పుస్తకాలు అందించారు. ఎవరి స్థాయిలో వారు తమ కింది వారిని బెదిరించి కూపన్లు అంట గడుతున్నారు.
దీంతో జనసేన నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కేసు నమోదుకు పోలీసులు నిరాకరించారు. దీంతో జనసేన.. జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు కోర్టు పిల్ దాఖలు చేశారు. గాదె వెంకటేశ్వరరావు పిల్ ను మంగళవారం జిల్లా కోర్టును విచారించారు. మంత్రి రాంబాబుపై వెంటనే కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించింది. అయితే పోలీసులు అంతా వైసీపీ కనుసన్నల్లో ఉంటారు కాబట్టి.. కోర్టు ఆదేశించిందని కేసు నమోదు చేస్తారేమో కానీ.. విచారణ జరిగే అవకాశం లేదని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.