ఇద్దరు ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు అంశం.. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వానికి రాను రాను తలనొప్పిగా మారుతోంది. ఎలా సమర్థింుకోవాలో తెలియక.. సైలెంట్ గాఉండటం కూడా.. అనేక చిక్కులు తెచ్చి పెడుతోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున… కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్… శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ పై దాడి చేశారంటూ.. వారి సభ్యత్వాలను స్పీకర్ మధుసూదనా చారి రద్దు చేశారు. రాత్రికి రాత్రి వారి అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్లు గెజిట్ నోటిఫికేషన్ ప్రకటించారు. వారిని రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయడానికి కూడా అనుమతించ లేదు. స్పీకర్ నిర్ణయంపై వారిద్దరూ కోర్టుకు వెళ్లారు.వాదనలు విన్న తర్వాత.. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా… కోమటిరెడ్డి, సంపత్ ల పై చర్యలు తీసుకున్నారన్న హైకోర్టు… స్పీకర్ నిర్ణయాన్ని తోసిపుచ్చి.. వారి శాసనసభ్యత్వాలను పునరుద్దరించాలని ఆదేశించింది.
కానీ తెలంగాణ ప్రభుత్వంపై… హైకోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకోలేదు. వారి సభ్యత్వాలను పునరుద్ధరించలేదు. దాంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌ల మరోసారి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు… శాసన సభ్యత్వ రద్దుపై కోర్టు తీర్పును ఎందుకు అమలు చేయలేదని.. తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వారం రోజుల్లో స్పష్టత ఇవ్వకపోతే…అసెంబ్లీ కార్యదర్శి తమ ఎదుట హాజరు కావాల్సి ఉంటుందన్న హైకోర్టు హెచ్చరించింది. అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచందర్‌రావుపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మీరు ప్రభుత్వ న్యాయవాదిగా ఉన్నారా?…. పార్టీ న్యాయవాదిగా ఉన్నారా అని హైకోర్టు ప్రశ్నించారు. వారం రోజుల్లో స్పష్టత ఇవ్వాలని హైకోర్టు ఆదేసిస్తూ… తదుపరి విచారణ ఆగస్టు 3 కు వాయిదా వేసింది.
అసెంబ్లీ అధికారాల్లో న్యాయవ్యవస్థ జోక్యం అంశంపై సందేహాలున్నప్పటికీ…కోమటిరెడ్డి, సంపత్ లు.. మొదటిసారి పిటిషన్ వేసినప్పుడు.. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ ప్రకాష్ రెడ్డి అసెంబ్లీలో ఏం జరిగిందో వీడియోలు సమర్పిస్తామన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం వీడియోలు సమర్పించడానికి సిద్ధపడలేదు. అసలు అసెంబ్లీ నిర్ణయాన్ని … ప్రశ్నించే హక్కు హైకోర్టుకు లేదని అడ్వకేట్ జనరల్ వాదించాలి కానీ.. వీడియోలు ఇస్తామని చెప్పడమేమిటని.. ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. అడ్వకేట్ జనరల్ ప్రకాష్ రెడ్డి వద్ద రాజీనామా లేఖ కూడా తీసుకుంది. ఇప్పుడీ విషయంలో మళ్లీ మొదటి నుంచి వాదనలు వినిపించే అవకాశం లేక.. కోర్టు తీర్పును… అమలు చేయలేక టీఆర్ఎస్ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరవుతోంది.