విశాఖకు కార్యాలయాలను తరలించాలనుకున్న ఏపీ ప్రభుత్వ ఆశలపై హైకోర్టు నీళ్లు చల్లింది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఏర్పాటు పేరుతో ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలించే యత్నాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను త్రిసభ్య ధర్మాసనం ముందుకు పంపాలని ట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు నిర్ణయించారు. త్రిసభ్య ధర్మాసనం తన నిర్ణయం వెల్లడించేవరకూ యథాతథ స్థితి పాటించేలా ప్రభుత్వాన్ని ఆదేశిశించారు.
సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు ముసుగులో విశాఖలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటుచేస్తున్నారని అమరావతి పరిరక్షణ సమితి మేనేజింగ్ ట్రస్టీ గద్దె తిరుపతిరావు, రాజధాని ప్రాంత రైతులు మాదాల శ్రీనివాసరావు, వలపర్ల మనోహరం హైకోర్టులో వ్యాజ్యం దాఖలుచేశారు. ఇదే వ్యవహారంపై రాజధాని రైతు పరిరక్షణ సమితి కార్యదర్శి ధనేకుల రామారావు, అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య ఉపాధ్యక్షుడు కల్లం రాజశేఖరరెడ్డి వేర్వేరుగా వ్యాజ్యాలు వేశారు. ప్రభుత్వ న్యాయవాదులు న్యాయమూర్తిని శంకిస్తూ.. ప్రస్తుత వ్యాజ్యాలను త్రిసభ్య ధర్మాసనం ముందుకు పంపాలని కోరారు.
ఈ అభ్యర్థనతోనే అనుబంధ పిటిషన్ వేశామన్నారు. సీఎం క్యాంపు కార్యాలయ వ్యవహారం త్రిసభ్య ధర్మాసనం ముందు పెండింగ్లో ఉందన్నారు. చివరికి త్రిసభ్య ధర్మాసనం వద్దకు పంపుతూ.. స్టేటస్ కో విధించారు.