తిరుపతిలో పారిశుధ్య పనులకు టీటీడీ నిధులను మళ్లించేందుకు తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు స్టే ఇచ్ిచంది. టెండర్లు ఖరారు చేసుకోవచ్చు కానీ.. నిధులు మాత్రం టీటీడీవి ఇవ్వవొద్దని స్పష్టం చేసింది. బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు నిధులు విడదల చేయవద్దని స్పష్టం చేసింది. భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ అయ్యారు. ఆయన కుమారుడికి వచ్చే ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీ టిక్కెట్ ఖరారు చేసుకున్నారు. ఓ వైపు తిరుపతిలో ఐదేళ్లుగా అభివృద్ధి పనులు లేవు . ప్రజలు తిరగబడేలా ఉన్నారు.
దీంతో శ్రీవారి నిధుల మీద కన్నేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిధులను తిరుపతి కార్పొరేషన్లోని రోడ్లు, కాలనీల పారిశుధ్యం పనులకు వినియోగించాలని ఇటీవల నిర్ణయించారు. ఏటా రూ.100 కోట్లు ఖర్చు చేసేందుకు ఈవో ఆమెదం తెలుపుతూ పనుల నిర్వహణకు టెండర్లు పిలిచారు. భక్తులు ఇచ్చే కానుకలు, నిధులపై ఆధారపడి టీటీడీని నిర్వహిస్తున్నారు. దేవదాయ చట్టంలోని సెక్షన్ 111ను అనుసరించి నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంతకు ముందు భూమన మరో స్కెచ్ వేశారు. గతంలో ఒక శాతం టీటీడీ నిధుల్ని తిరుపతి అభివృద్ధికి కేటాయించాలన్న తీర్మానాన్ని చేశారు.
రాజకీయ దుమారం రేగడంతో ప్రభుత్వం అంగీకరించలేదు. దొడ్డిదోవన ఇలా ఖర్చు పెడుతున్నారారు. కుమారుడి ఎన్నికల విజయం కోసం.. శ్రీవారి నిధుల్ని ఇలా దుర్వినియోగం చేయడంపై శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. దేవుడి సొమ్మును సొంత అవసరాల కోసం వాడుకున్నట్లుగా ఖర్చు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.