ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల విషయంలో.. ఉన్నతాధికారులు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. రాజధాని తరలింపు విషయంలో… ఇంగ్లిష్ మీడియం విషయంలో.. చట్టాలకు విరుద్ధంగా… ప్రభుత్వ పెద్దల మౌఖిక ఆదేశాల మేరకు .. వ్యవహరిస్తే.. అయ్యే ఖర్చును.. వ్యక్తిగత ఖాతాల నుంచి వసూలు చేస్తామని హైకోర్టు స్పష్టమైన వార్నింగ్లు అధికారులకు ఇచ్చింది. దీనికి కారణం… బిల్లు ఆమోదం పొందకపోయినా.. రాజధానిని తరలించడానికి అధికారులు ఏర్పాట్లు చేయడమే. విశాఖలో భవనాలు చూసి.. ఉద్యోగులకు మౌఖిక ఆదేశాలు జారీ చేయడమే. అసలు ఎలాంటి చట్టబద్ధత లేకుండా.. ఈ తరలింపును.. అడ్డుకోవడానికి హైకోర్టు.. అధికారులను బాధ్యుల్ని చేస్తామని హెచ్చరించాల్సి వచ్చింది. దీంతో.. ఈ వ్యవహారంలో భాగమవుతున్న అధికారులు ముందు వెనుకాడాల్సి వస్తోంది.
ఇంగ్లిష్ మీడియం అమలు విషయంలోనూ.. ప్రభుత్వం తీరు అంతే ఉంది. విద్యాహక్కు చట్టం ప్రకారం.. ఎనిమిదో తరగతి వరకు.. పిల్లలకు మాతృభాషలో చదువుకునే హక్కు ఉంది. దాన్ని కాలదన్నేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది ఇంకా చట్ట రూపంలోకి రాలేదు. కానీ.. వచ్చే విద్యా సంవత్సరం కోసం అంటూ.. ఇప్పటికే.. పుస్తకాల ముద్రణ… ఇతర పనుల్ని ప్రారంభించడానికి మౌఖిక ఆదేశాలు ఇచ్చేశారు. ఈ విషయం హైకోర్టు దృష్టికి … లాయర్లు తీసుకెళ్లడంతో.. అక్కడా అధికారుల్ని బాధ్యుల్ని చేస్తామని హెచ్చరికలు వచ్చాయి. అంతే కాదు.. ఏసీబీ, సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తామని కూడా.. ఘాటుగా చెప్పడంతో.. అధికారులకు ముందుకు.. వెనక్కు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.
ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలన్నీ.. వివాదాస్పదమైనవే. ఉదాహరణకు.. ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ వైసీపీ రంగులు వేయడం.. వివాదాస్పదమవుతోంది. దానికి.. ఉన్నతాధికారులు జీవోలు కూడా ఇచ్చారు. ఇలా చేయడం చట్ట విరుద్ధమన్న సంగతి తెలిసి కూడా.. పాలకులు చెప్పారని.. రూ. వందల కోట్లు పెట్టి వేసేశారు. ఇప్పుడు.. తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై.. హైకోర్టు ఎలాంటి ఆదేశాలిస్తుందోనని అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి క్విడ్ ప్రో కో కి పాల్పడటం వల్ల పెద్ద ఎత్తున అధికారులు.. జైలు పాలయ్యారు. కేసులు పాలయ్యారు. ఇప్పుడు స్వయంగా జగనే అధికారంలో ఉండటంతో.. ఆయన చేస్తున్న పనులు ఇంకెన్ని ఇబ్బందులు తెచ్చి పెడతాయోనన్న ఆందోళన.. అధికారవర్గాల్లో ఏర్పడుతోంది.