విశాఖ ఎయిర్ పోర్టులో జరిగినట్లు చెబుతున్న దాడిలో.. జగన్ కు అయిన గాయంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. దాడి ఘటన జరిగిన వెంటనే.. విమానాశ్రయంలోని డ్యూటీ డాక్టర్ ఆయనకు ప్రాధమిక వైద్యం చేశారు. హాఫ్ సెంటిమీటర్ గాయం మాత్రమే కావడంతో.. గాయం దగ్గర శుభ్రం చేసి…యాంటిబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ ఇచ్చి పంపేశారు. దానికి కట్టు కూడా అవసరం లేదని తేల్చారు. ఈ మేరకు … నిబంధనల ప్రకారం.. వైద్యం చేసినట్లు.. నివేదిక.. రిపోర్టును.. ఎయిర్పోర్టు సిబ్బందికి ఇచ్చారు. ప్రాథమిక చికిత్స చేయించుకున్న దాదాపు గంట తర్వాత హైదరాబాద్ ఫ్లైట్ వచ్చింది. జగన్ తన బాడీ లాంగ్వేజ్ లో ఎలాంటి మార్పులు తెచ్చుకోలేదు. ఎప్పటి లాగే అందరికీ నమస్కరిస్తూ… వెళ్లారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై.. ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో ప్రయాణానికి అనుమతి ఇచ్చారు.
అయితే.. అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి… హైదరాబాద్ కు వచ్చిన తర్వాత తన ఇంటి సమీపంలో ఉన్న సిటీ న్యూరో హాస్పిటల్ అనే ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ డాక్టర్లు కాస్తంత డ్రామా నడిపించారు. అనస్థిషీయా మత్తులో జగన్ ఉన్నట్లు కొన్ని ఫోటోలు చేశారు. తొమ్మిది కుట్లేసినట్లు చెప్పుకొచ్చారు. ఏకంగా ఒకటిన్నర ఇంచ్ లోతులో గాయం అయినట్లు కూడా రిపోర్ట్ విడుదల చేశారు. దీంతో .. జగన్ గాయంపై కొత్త అనుమానాలు ప్రారంభమయ్యాయి. అసలు విశాఖలో వైద్యులు ప్రాథమిక వైద్యం చేసి చెప్పింది కరెక్టా..? లేక హైదరాబాద్ జగన్ వైద్యం చేయించుకున్న ఆస్పత్రి కరెక్టా..? .
విశాఖ డాక్టర్లు చెప్పిందే నిజమవుతుంది… ఎందుకంటే.. ఒకటిన్నర ఇంచ్ గాయం అంటే.. రక్తం ధారపాతంగా కారిపోతుంది. వెంటనే… కట్లు వేయాలి. జగన్ అలాంటి కట్లు ఏమీ లేకుండానే హైదరాబాద్ వచ్చారు. మొత్తానికి తనకు ఏదో పెద్ద గాయమే అయిందని… షో చేయడానికి జగన్ అండ్ కో ప్రయత్నించారన్న ఆరోపణలు వస్తున్నాయి.